Samir Sharma
-
ఏపీ సీఎస్‌గా సమీర్‌శర్మ పదవీ కాలం పొడిగింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీకాలం పొడిగిస్తూ తాజాగా కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. సమీర్‌శర్మను మరో 6 నెలలు పాటు ఏపీ సీఎస్‌గా కొనసాగించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. వచ్చే ఏడాది మే నెల వరకు ఆయన సీఎస్‌గా పనిచేయనున్నారు. కాగా, సమీర్‌శర్మ పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఈనెల 2వ తేదీన కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. చదవండి: ప్లేట్లెట్ థెరపీ కిట్‌కు పేటెంట్.. రెండు తెలుగు రాష్టాల్లో ఇదే తొలిసారి పొడిగింపు ప్రతిపాదనను ఆమోదిస్తూ సంబంధిత ఉత్తర్వులను జారీచేసింది. కాగా, రెండు నెలల క్రితం ఏపీకి సీఎస్‌గా సమీర్‌శర్మ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఈనెల 30న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే తాజా పొడిగింపుతో సమీర్‌శర్మ మరో ఆరునెలలు ఏపీకి చీఫ్ సెక్రెటరీగా సేవలందించనున్నారు. -
ప్రముఖ సీరియల్ నటుడు సమీర్ శర్మ ఆత్మహత్య
-
విషాదం: మరో నటుడు ఆత్మహత్య!
ముంబై: హిందీ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. నటుడు సమీర్ శర్మ(44) మృతి చెందాడు. ముంబైలోని మలాద్‌లో అద్దెకుంటున్న ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సమీర్ ఫ్లాట్‌కు చేరుకోగా.. అప్పటికే కుళ్లిపోయిన మృతదేహం దర్శనమిచ్చింది. దీంతో రెండు, మూడు రోజుల క్రితమే అతడు మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సూసైడ్ నోట్ సహా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. హసీ తో ఫసీ వంటి సినిమాలతో పాటు కహానీ ఘర్ ఘర్ కీ, క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ వంటి సీరియళ్లతో గుర్తింపు పొందిన నటుడు సమీర్ శర్మ. ప్రస్తుతం అతడు ఓ ప్రముఖ ఛానెల్లో ప్రసారమవుతున్న యే రిష్తే హై ప్యార్ కే సీరియల్లో నటిస్తున్నాడు.(ఆత్మహత్య చేసుకున్న మరో నటుడు) ఈ క్రమంలో ఫిబ్రవరిలో అతడు ముంబైలోని వెస్ట్ మలద్‌లో గల చించోలి బండర్లోని ఓ అపార్టుమెంట్లో అద్దెకు దిగాడు. కారణమేమిటో తెలియదు గానీ ఆగష్టు మొదటి వారంలో తన ఫ్లాట్‌లో విగతజీవిగా తేలాడు. తలుపులు మూసి ఉండటంతో ఎవరూ ఈ విషయాన్ని గమనించలేదు. అయితే సమీర్ ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో వాచ్మెన్ పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు తెరచి చూడగా.. కిచెన్‌లో సమీర్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఈ క్రమంలో పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ లభించలేదు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సమీర్ మరణానికి ఆర్థిక ఇబ్బందులు కారణమా అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఇక లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పలువురు సినీ ఆర్టిస్టులు బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. -
ఇక మహిళలదే రాజ్యం
సాక్షి, సంగారెడ్డి: పురపాలక పీఠాలపై మహిళ లలే ఆసీనులు కానున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అనూహ్య రీతిలో మెజారిటీ స్థానాల చైర్పర్సన్ పదవులు మహిళలకు రిజర్వు అయ్యాయి. మునిసి‘పోల్స్’పై ఆశలు పెట్టుకున్న పురుషులకు ఈ రిజర్వేషన్లు కంగుతినిపించాయి. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలతో పాటు కొత్తగా ఏర్పడిన మరో మూడు నగర పంచాయతీల చైర్పర్సన్ స్థానాలు మహిళలకే రిజర్వు అయ్యాయి. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్పర్సన్ స్థానాల రిజర్వేషన్లను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శనివారం సాయంత్రం ప్రకటించింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. రిజర్వేషన్ల కేటాయింపులో జనరల్, బీసీ వర్గాలకు పెద్ద పీట లభించగా, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం లభించలేదు. సుప్రీం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. 2012లో నిర్వహించిన కుల గణన ఆధారంగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రకటించింది. వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్గత ఏడాది ఆగస్టు నెలలో గజిట్ నోటిఫికేషన్ వెల్లడించారు. ఇప్పుడు చైర్పర్సన్ పదవులకూ రిజర్వేషన్లు వెల్లడి కావడంతో వారం రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలుండగా, మెదక్, సిద్దిపేట మున్సిపాలిటీల చైర్పర్సన్ పదవులు జనరల్(అన్ రిజర్వుడు) కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపాలిటీల చైర్పర్సన్ స్థానాలు మహిళా(జనరల్) అభ్యర్థులకు రిజర్వు అయ్యాయి. నగర పంచాయతీలు బీసీలకు.. జిల్లాలో కొత్తగా ఏర్పడిన నాలుగు నగర పంచాయతీలూ బీసీలకు రిజర్వు అయ్యాయి. అందోల్-జోగిపేట, చేగుంట, దుబ్బాక నగర పంచాయతీల చైర్ పర్సన్ స్థానాలు బీసీ(మహిళ)లకు రిజర్వు కాగా .. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ చైర్ పర్సన్ బీసీ(జనరల్)కు రిజర్వు అయింది.