సాక్షి ఫొటోగ్రాఫర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు
న్యూశాయంపేట : ఈ నెల 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఫొటో జర్నలిస్టు ఛాయాచిత్ర ప్రదర్శనలో సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ సంపెట వెంకటేశ్వర్లుకు అవార్డు వచ్చింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ నెల 17 నుంచి 26 వరకు ఏర్పాటు చేసిన రాష్ట్ర వ్యాప్త ప్రదర్శనకు ఫొటో జర్నలిస్టులు 104 ఎంట్రీలతో 683 ఛాయాచిత్రాలను పంపించగా, 145 ఫొటోలను ప్రదర్శనకు పెట్టారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఇండియన్ ఫొటో ఫెస్టివల్ డైరెక్టర్ అశ్విన్ మాథ్యూస్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి కేటగిరీల వారీగా బహుమతులకు ఎంపిక చేశారు. మొదటి విభాగం బెస్ట్ న్యూస్ పిక్చర్లో పల్లెవాగులో జలకాలు చిత్రానికి సంపెట వెంకటేశ్వర్లుకు రెండవ ప్రోత్సాహక బహుమతి లభించింది.
హన్స్ ఇండియా ఫొటోగ్రాఫర్కూ అవార్డు..
రెండవ విభాగం తెలంగాణ పండుగలు జాతరలు, చారిత్రాత్మక కట్టడాలు సంస్కృతిలో వేయి స్తంబాల గుడి చిత్రానికి ది హన్స్ ఇండియా ఫొటోగ్రాఫర్ గోకారపు శ్యాంకుమార్‌కు మొదటి ప్రోత్సాహక బహుమతి లభించింది. 26న ఉదయం రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో వీరికి మంత్రి కేటీఆర్ అవార్డులను అందజేస్తారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు, శ్యాంకుమార్‌ను పలువురు అభినందించారు.