తమిళ నటితో ఇమ్రాన్ హష్మీ లిప్-లాక్
చెన్నై: తమిళ టీవీ, సినీ నటి శాండ్రా అమీ బాలీవుడ్ లో అడుగు పెడుతోంది. ఇమ్రాన్ హష్మీ హీరోగా దర్శకుడు ఆంథోనీ హష్మీ రూపొందిస్తున్న సినిమాలో ఆమె అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ తమిళ ప్రియురాలిగా ఆమె కనిపించనుంది.
'ఇమ్రాన్ ప్రియురాలిగా ఈ సినిమాలో చిన్న పాత్ర పోషిస్తున్నా. ఆయనతో కలిసి కొన్ని సీన్లలో కనిపిస్తా. దర్శకుడు ఆంథోనీ నా ఫోటోలు చూసి ఈ పాత్రకు నేనైతే సరిపోతానని చెప్పి నన్ను ఎంపిక చేశారు. మొదటిసారిగా బాలీవుడ్ సినిమాలో నటిస్తుండడం సంతోషంగా ఉంది' శాండ్రా అమీ పేర్కొంది.
అధర చుంబన సన్నివేశంలో ఆమె నటించనుంది. కథ అనుగుణంగా ఇమ్రాన్ తో లిప్-లాక్ సీన్ చేయాల్సివస్తోందని వెల్లడించింది. బాలీవుడ్ లో సీరియల్ కిస్సర్ గా పేరుగాంచిన ఇమ్రాన్ ఇప్పుడు తమిళ నటితో లిప్-లాక్ కు రెడీ అయ్యాడు. ఆమె నటించిన 'శివప్పు ఇనక్కు పిడిక్కుమ్' తమిళ సినిమా త్వరలో విడుదలకానుంది.