sanjeevareddy
-
అట్టహాసంగా సంజీవ్‌రెడ్డి నామినేషన్..
సాక్షి, ఆదిలాబాద్: కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ అల్లూరి సంజీవ్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. శుక్రవారం ఆయన ఆదిలాబాద్ నియోజకవర్గంలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మందితో డప్పుచప్పుళ్ల నడుమ శాంతినగర్‌లోని దివంగత చిల్కూరి రాంచంద్రారెడ్డి నివాసం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల కలెక్టరేట్ వరకు సాగింది. అనంతరం రిటర్నింగ్ అధికారి స్రవంతికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఇందులో సాజిద్‌ఖాన్, గండ్రత్ సుజాత తదితరులు పాల్గొన్నారు. -
తాటికాయల కోసం వెళ్లి...
గార్లదిన్నె(శింగనమల): పామిడి మండలం పాళ్యం గ్రామానికి చెందిన సంజీవరెడ్డి(35) గార్లదిన్నె మండలం ఎగువపల్లి శివార్లలోని చెట్టు పై నుంచి పడి మంగళవారం మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. సంజీవరెడ్డి ఎగువపల్లిఇ చెందిన నారాయణరెడ్డి అనే వ్యక్తి ఐచర్ వాహనానికి నాలుగేళ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు వివరించారు. రోజూ టమాటాల లోడుతో హైదరాబాద్ వెళ్లేవాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో పని లేకపోవడంతో క్లీనర్‌తో కలసి గ్రామ సమీపంలోని తాటి చెట్టు వద్దకు వెళ్లాడన్నారు. అక్కడ తాటికాయల కోసం చెట్టుపైకెక్కిన అతను అదుపు తప్పి కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దకు కుమార్తెలు ఉన్నారు. -
ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం
– ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి డాక్టర్ సంజీవ రెడ్డి – నంద్యాలలో ఏపీఎస్ఈబీ 327 రాష్ట్ర కార్యవర్గ సమావేశం నూనెపల్లె: విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘటిత ఉద్యమాలే శరణ్యమని ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. నంద్యాలలోని శోభా ఫంక్షన్ హాలులో మంగళవారం ఏపీఎస్ఈబీ 327 యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. విద్యుత్ ఉద్యోగులకు సరైన పెన్షన్ విధానాన్ని అమలు చేయడం లేదని సంజీవరెడ్డి ఆరోపించారు. ఎన్టీపీసీలో ఏడాదికి రూ. 80వేలు బోనస్ ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వలేనని చెప్పడం సిగ్గుచేటన్నారు. మోడీ ప్రభుత్వం విదేశీ సంస్థల ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఇచ్చి దేశ సంపదను వారికి దోచి పెడుతోందన్నారు. కాంట్రాక్టు, ప్రయివేటు ఉద్యోగంతో హోదా పెరగదని, వారికి పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాడ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులు పెరుగుతున్నా కొత్తవారికి కాంట్రాక్టు బేసిక్ ఇవ్వడం ఎక్కడా లేదన్నారు. అనంతరం పవర్ వర్కర్ అనే యూనియన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి, 327 యూనియన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ సాయిబాబా, రీజినల్ నాయకులు రఘు, గిరి, నంద్యాల డివిజన్ కార్యదర్శి లక్ష్మికాంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కౌలు రైతు ఆత్మహత్య
చెన్నూరు: ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం బిజినేపల్లి గ్రామానికి చెందిన కౌలురైతు సంజీవరెడ్డి(40) అప్పులబాధతో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సంజీవరెడ్డి ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగుచేసిన పంట ఎండిపోవడం, అప్పులు ఇచ్చినవారి ఒత్తిడి ఎక్కువ అవడంతో తీవ్ర మనస్థాపం చెందాడు. దీంతో బుధవారం ఆత్మహత్య పాల్పడ్డాడు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.