Sanjit
-
క్వార్టర్స్‌లో సంజీత్, నిశాంత్
బెల్గ్రేడ్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సోమవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఒకవైపు నిశాంత్ దేవ్ (71 కేజీలు), సంజీత్ (92 కేజీలు) అద్భుత విజయాలతో క్వార్టర్ ఫైనల్ చేరగా... మరోవైపు రోహిత్, ఆకాశ్, సుమిత్, దీపక్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్‌ల్లో నిశాంత్ దేవ్ 3–2తో మార్కో అల్వారెజ్ వెర్డె (మెక్సికో)పై, సంజీత్ (92 కేజీలు) 4–1తో జియోర్జి చిగ్లాడ్జె (జార్జియా)పై గెలుపొందారు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రోహిత్ (భారత్) 1–4తో సెరిక్ (కజకిస్తాన్) చేతిలో.... ఆకాశ్ సాంగ్వాన్ (67 కేజీలు) 0–5తో కెవిన్ బ్రౌన్ (క్యూబా) చేతిలో ... సుమిత్ (75 కేజీలు) 0–5తో యోన్లిస్ (క్యూబా) చేతిలో... దీపక్ 0–5తో సాకెన్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
మహ్మద్ రఫి పాటలు
‘‘ఈ టైటిల్ ఎందుకు పెట్టాం, కథ ఏమిటనేది సినిమా చూసి తెలుసుకోవాలి. హీరో సంజిత్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. లండన్ వెళ్లి యాక్టింగ్ కూడా నేర్చుకొచ్చాడు. హీరోయిన్ పాత్ర కూడా ఈ సినిమాకు కీలకం’’ అని దర్శకుడు ఓంప్రకాష్ మార్తా చెప్పారు. సంజిత్, శ్రావణి ఆర్లెండ్ జంటగా కె.అనేష్‌బాబు నిర్మించిన ‘తను-నేను-మహ్మద్ రఫి’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. రామ్‌నారాయణ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆవిష్కరించి, ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రస్తుత సైబర్ నేరాలకు, ఐటీ మోసాలకు అద్దం పట్టే చిత్రమిదని నిర్మాత తెలిపారు. అయిదు పాటలూ బాగా కుదిరాయని సంగీత దర్శకుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అనిల్ కుందారెడ్డి, పెద్దిరెడ్డి, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.