Sanjiv Kapoor
-
వివాదంలో జెట్ ఎయిర్వేస్ సీఈవో.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ప్రముఖ దేశీయ ఏవియేషన్ దిగ్గజం జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్ వివాదంలో చిక్కుకున్నారు. దేశంలో ఉన్న మెట్రో స్టేషన్ల సౌందర్యం,ఆర్కిటెక్చర్‌పై (aesthetics and architecture) ఆసంతృప్తి వ్యక్తం చేస్తూ వైట్‌ఫీల్డ్-కేఆర్ పురం మెట్రో మార్గం (పర్పుల్ లైన్) - దుబాయ్ మెట్రో స్టేషన్ ఫోటోల్ని ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లపై ఇప్పుడు విపరీతంగా ట్రోలింగ్ నడుస్తున్నది. సంజీవ్ కపూర్ భారత్ - దుబాయ్‌లోని మౌలిక సదుపాయాలను పోల్చారు. దుబాయ్ మౌలిక సదుపాయాలతో పోలిస్తే ఇండియన్ మెట్రోస్టేషన్లు ‘కళ లేని కాంక్రీటు కళ్లజోళ్లు’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. అంతే ఆ ట్వీట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు జెట్ ఎయిర్వేస్ సీఈవోను ట్రోలింగ్ చేస్తున్నారు. ఓ ట్విటర్ యూజర్ బెంగుళూరు, గుర్గావ్, కోల్కతాలలోని ఓవర్‌గ్రౌండ్/ఓవర్ హెడ్ మెట్రో స్టేషన్లు కళావిహీనంగా ఉన్నాయా? అని ప్రశ్నిస్తూ సంబంధిత మెట్రోస్టేషన్ ఫోటోలను పోస్ట్ చేశాడు. దీంతో పాటు దుబాయ్ మెట్రోస్టేషన్ కంటే భారత్‌లో మెట్రో స్టేషన్లు బాగున్నాయని నొక్కాణిస్తూ మరిన్ని ఫోటోల్ని షేర్ చేశారు. చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా అందంగా ఉన్న మెట్రోస్టేషన్లను, వాటి డిజైన్ ఫోటోల్ని ట్విటర్లో పంచుకుంటున్నారు. 'అది కూడా కరెక్టే కదా సార్' సంజీవ్ కపూర్ అభిప్రాయాన్ని ఏకీభవించిన మరికొందరు.‘‘అది కూడా కరెక్టే కదా సార్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్యావరణ అనుకూలమైనది కాదు. ఖర్చుతో కూడుకున్నది. కేవలం మెట్రో స్టేషన్ మాత్రమే కాదు ఇతర పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా. ఈ రోజుల్లో ప్రైవేట్ నిర్మాణాలు సైతం అందానికి తక్కువ ప్రాముఖ్యతనిచ్చి గందరగోళం సృష్టిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ చేతులు మీదిగా కాగా, జెట్ ఎయిర్వేస్ సీఈవో ట్వీట్ చేసిన బెంగళూరులోని 13 కిలోమీటర్ల వైట్‌ఫీల్డ్-కెఆర్ పురం మెట్రో (పర్పుల్ లైన్) రైలు మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 25న ప్రారంభించనున్నారు. Delhi Metro for you! pic.twitter.com/HA8z0g6AZZ — Rahul Kapoor (@okwithrk) March 18, 2023 The same station from some distance has this look (not the right part of pic), but yes, most of the stations are box shaped. •Sri Sathya Sai Hospital Metro Station#Bangalore pic.twitter.com/SCWEUxtmk6 — Bangalore Metro Updates (@WF_Watcher) March 18, 2023 Bangalore metro has amazing artwork on the walls. They let artists paint the walls later on. Case in point, church street metro: pic.twitter.com/41ojhy7JQx — Srijan R Shetty (@srijanshetty) March 19, 2023 -
‘నేను మీ పని మనిషిని కాను సార్’.. ఎయిర్ హోస్టెస్ తీరుపై ప్రశంసలు
ప్రముఖ ఏవీయేషన్ సంస్థ ఇండిగో సిబ్బంది, విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల మధ్య జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. ఈ వివాదంలో మరో ఏవియేషన్ సంస్థ సీఈవో ఎయిర్ హోస్టెస్‌కు సపోర్ట్ చేశారు. నెటిజన్లు సైతం ఎయిర్ హోస్టెస్ తీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇండిగో సంస్థ ఇస్తాంబుల్- ఢిల్లీ విమానాల కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. డిసెంబర్ 16న ఇండిగో విమానంలోని ఓ ప్రయాణికుడు తానుకోరుకున్న ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో లేవని వాగ్వాదానికి దిగాడు. ఫ్లైట్‌లో ఉన్న ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఈ ఆర్.గూర్ప్రీత్ సింగ్ మెన్స్ వీడియో తీసి సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో అది తెగ చక్కెర్లు కొడుతోంది. వాళ్లూ మనుషులే As I had said earlier, crew are human too. It must have taken a lot to get her to breaking point. Over the years I have seen crew slapped and abused on board flights, called "servant" and worse. Hope she is fine despite the pressure she must be under. https://t.co/cSPI0jQBZl — Sanjiv Kapoor (@TheSanjivKapoor) December 21, 2022 ఈ తరుణంలో ఫ్లైట్‌లో ప్రయాణికులు-ఎయిర్ హోస్టెస్ మధ్య జరిగిన ఘర్షణపై జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్ స్పందించారు. ఇండిగో ఎయిర్ హోస్టెస్‌కు మద్దతు పలికారు. సిబ్బంది కూడా మనుషులేనని వ్యాఖ్యానించారు. ‘నేను ముందే చెప్పినట్లు,సిబ్బంది కూడా మనుషులే.నేను గత కొన్నేళ్లుగా విమానంలో సిబ్బందిని..చెంపదెబ్బలు కొట్టడం దూర్భాషలాడడం చూశాను. ప్రయాణికుడితో జరిగిన వాగ్వాదంలో ఆమె తీవ్రంగా త్తిడికి గురైంది. ఇప్పుడు ఆమె బాగుందని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ఎయిర్ హోస్టెస్‌కు అండగా నెటిజన్లు సీఈవో వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందించారు.హెచ్ఆర్, యాజమాన్యం మహిళా సిబ్బందికి అండగా నిలుస్తారని ఆశిస్తున్నాను. వారు ఈ స్థాయిలో చేరేందుకు ఎంతో కష్టపడిందో అర్ధం చేసుకోవాలంటూ అండగా నిలుస్తున్నారు. ఈ ఘటనలో మహిళా సిబ్బంది తప్పు లేదని, ఎంతో ఓర్పుతో సమాధానం ఇచ్చిందని ప్రశంసిస్తున్నారు. ఫ్లైట్‌లో ఏం జరిగింది ఇండిగోకు విమానం ‘6ఈ 12’ ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీ వైపు వస్తుంది. ప్రయాణ సమయంలో ఎయిర్ హోస్టెస్‌కు, ప్రయాణికుడి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో ప్రయాణికుడు దురుసగా ప్రవర్తించడంతో ఓ ఎయిర్ హోస్ట్ కన్నీటి పర్యంతమైంది. దీంతో మరో ఎయిర్ హోస్టెస్ వారికి సర్ది చెప్పి గొడవను సద్దుమణిగించేందుకు వెళ్లింది. అప్పటికే ఆగ్రహంతో ఉన్న ప్రయాణికుడు మరింత రెచ్చిపోయాడు. గొడవను సద్దుమణించేందుకు ప్రయత్నించిన సదరు మహిళా ఉద్యోగిని వైపు చేత్తో సంజ్ఞలు చేశాడు. దీంతో సహనం కోల్పోయిన ఆమె ప్రయాణికుడికి గట్టిగా సమాధానం ఇచ్చింది. Tempers soaring even mid-air: "I am not your servant" An @IndiGo6E crew and a passenger on an Istanbul flight to Delhi (a route which is being expanded soon with bigger planes in alliance with @TurkishAirlines ) on 16th December : pic.twitter.com/ZgaYcJ7vGv — Tarun Shukla (@shukla_tarun) December 21, 2022 "నువ్వు నా వైపు వేలు చూపుతూ ఎందుకు అరుస్తున్నావు. నీ వల్ల నా సిబ్బంది ఏడుస్తున్నారు. దయచేసి పరిస్థితని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సరిపడ భోజనాలు (విమానంలో) ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఆహారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం’ అని మాట్లాడుతుండగా ప్రయాణికుడు అడ్డు తగిలాడు "ఎందుకు అరుస్తున్నావు?" అని ప్రయాణికుడు గట్టిగా అరిచాడు. ఎయిర్ హోస్ట్ తన స్వరం పెంచుతూ...ఎందుకంటే మీరు మా మీద అరుస్తున్నారు. నీ మీ పని మనిషిని కాదు సార్. ఎయిర్ హెస్ట్ని. ఇండిగో సంస్థ ఉద్యోగిని అంటూ అక్కడి నుంచి వెళ్లి పోయింది. శాండ్ విచ్ లేదని.. ఫ్లైట్ వివాదంపై ఇండిగో యాజమాన్యం స్పందించింది. ప్రయాణీకుడు శాండ్విచ్ అడిగారని, విమానంలో ఫుడ్ ఐటమ్ అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేస్తామని సిబ్బంది చెప్పారు. కానీ ఆ వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌పై అరవడం ప్రారంభించాడు. దీంతో భయాందోళనకు గురైన ఎయిర్ హోస్ట్ ఏడ్చినట్లు తెలిపింది. -
ఒక్క రూపాయికే విమాన ప్రయాణం!
విమాన సర్వీసు యాజమాన్యాల మధ్య నెలకొన్న పోటీ కారణంగా సామాన్యులకు కూడా ఆకాశమార్గాన ప్రయాణించడమనేది అందుబాటులోకి వస్తోంది. గత త్రైమాసికంలో 75 శాతం మేరకు విమాన ఛార్జీలను తగ్గించిన స్సైస్ జెట్ ఒక రూపాయి చార్జీకే దేశీయ విమానాల్లో ప్రయాణించవచ్చని తెలిపింది. దీనికి తోడుగా స్పైస్ జెట్ మరికొన్ని ప్రత్యేక స్కీములను ప్రకటిచింది. మంగళవారం నుంచి మూడు రోజుల్లోగా ప్రయాణించేవారు రూ. 799, 1499 రూపాయలకే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని స్పైస్ జెట్ వెల్లడించింది. టికెట్ రేటుకు అదనంగా ఎయిర్ పోర్ట్ ఫీజు, పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో టికెట్లు రిజర్వు చేసుకునే సదుపాయం జూలై నెల ఆరంభం నుంచి వచ్చే సంవత్సరం మార్చి 28 తేది వరకు ఉంటుంది. గతంలో తాము ప్రకటించిన స్కీమ్ కు విపరీతమైన స్పందన వచ్చింది. కొత్తగా విమానాల్లో ప్రయాణించేవారికి ఇది చక్కటి అవకాశం అని స్పైస్ జెట్ చీఫ్ సంజీవ్ కపూర్ తెలిపారు.