sankineni
-
రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
తిరుమలగిరి : రుణమాఫీ సక్రమంగా అమలు చేయకపోవడం, సకాలంలో రుణాలు అందక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఈ రెండు సంవత్సరాల పేరు మీద కేవలం 140 మందికి మాత్రమే భూ పంపిణీ చేశారని ఆరోపించారు. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూంలంటూ ఆశ చూపి ఒక్క ఇల్లు కూడా కట్టించ లేదని ఆరోపించారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌లో జరిగే మోడీ సభకు బూత్‌కు ఐదుగురు చొప్పున హాజరు కావాలని పిలుపునిచ్చారు. 2019 వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్కి బీజేపీ పార్టీయే ప్రత్యామ్నాయమని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడుచుకుపోయిందని, కాంగ్రెస్ పార్టీ లేవలేకుండా ఉందని ఆరోపించారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు కె.సోమయ్య, ధీన్‌దయాళ్, జయచందర్, జీడి భిక్షం, వెంకన్న, యాదగిరి, సుభాష్‌రెడ్డి, అబ్బాస్, సందీప్‌నేత, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులపై దాడి చేసిన ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయాలి
సూర్యాపేట : విద్యార్థులపై దాడి చేసిన హుజూర్‌నగర్‌లోని ప్రియదర్శిని కళాశాల ప్రిన్సిపాల్‌ను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అధిక ఫీజుల నియంత్రణ కోసం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యాసంస్థలు బంద్ నిర్వహించారని, ఇందులో భాగంగానే హుజూర్‌నగర్‌లోని ప్రియదర్శిని కళాశాలకు వెళ్లారని, ఇంతలోనే కళాశాలలో ఉన్న ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి వచ్చి విద్యార్థి సంఘం నాయకులపై దుర్భాషలాడి దాడి చేయడం హేయమైన చర్యన్నారు. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. -
అధికారంలోకి రావడమే లక్ష్యం
సూర్యాపేట: భారతీయ జనతా పార్టీ బలోపేతానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పార్టీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై తొలిసారిగా సూర్యాపేటకు వచ్చిన సందర్భంగా సంకినేని వెంకటేశ్వర్రావుకు సోమవారం పట్టణంలోని హైమాగార్డెన్లో సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. తనకు ఏనాడూ జిల్లా అధ్యక్ష పదవిపై ఆశ లేదని, రాష్ట్ర నాయకత్వం అప్పగించడంతోనే స్వీకరించానని, తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. బంగారు తెలంగాణ అని చెబుతూ సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కష్టపడి కాకుండా ఇష్టపడి రాజకీయం చేసే వ్యక్తి సంకినేని అనిఅన్నారు. అంతకు ముందు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు. పట్టణ అధ్యక్షుడు హబీద్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మధుసూదన్‌రెడ్డి, మల్లేశం, సులోచన, ఓరుగంటి రాములు, సాంబయ్య, గోలి ప్రభాకర్, కూతురు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు లింగయ్య, రాములు, కొణతం సత్యనారాయణరెడ్డి, పాండురంగాచారి, నల్లగుంట్ల అయోద్య, రుక్మారావు, సుజాత, కాసోజు సుమలత, కొండేటి ఏడుకొండల్, రంగినేని ఉమాలక్ష్మణ్‌రావు, చల్లమల్ల నర్సింహ్మ, కిషన్, వెంకట్‌రెడ్డి, రామగిరి నగేష్, భాస్కర్, నర్సింహ్మరెడ్డి, ఉప్పు శ్రీనివాస్, జీడి భిక్షం, గార్లపాటి మమతారెడ్డి, రాణి, వీరేంద్ర, కిరణ్, ఫణినాయుడు, నరేష్, అనంతుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మొక్కల పూర్తి వివరాలతో హాజరుకావాలని అధికారులకు సూచించారు. నాటిన ప్రతి మొక్క వివరాలను పూర్తిస్థాయిలో క్రోడీకరించి సేకరించాలని నియోజకవర్గ ఇన్చార్జి అధికారులను కోరారు. 65వ జాతీయ రహదారి వెంట నాటిన ప్రతి మొక్కకు 30 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి మొక్కలను సంరక్షిస్తున్నట్లు వివరించారు. వర్షాలుపడని చోటట్యాంకర్లను ఉపయోగించి నీటిని సరఫరా చేసి మొక్కలను కాపాడాలని సూచించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమ అమలు జరుగుతున్న విధానంపై ఆకస్మిక తనిఖీలు చేస్తారని తెలిపారు. అధికారులు అప్రమత్తతో పనిచేసి జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కొన్ని శాఖల్లో ఇంకా మందకొడిగా పనులు నడుస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినందున వెంటనే సంబంధిత శాఖల అధికారులు పనులు వేగవంతంగా చేయడానికి కృషి చేయాలని సూచించారు. ఇప్పటివరకు నాటిన ప్రతి మొక్కను సంరంక్షించడానికి ఫెన్సింగ్ 15 శాతం మాత్రం జరిగిందని, మిగతా పనులు వేగవంతం చేసి ఫెన్సింగ్‌ను ప్రతి మొక్కకు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏజేసీ వెంకట్రావు, డీఆర్వో రవి, పులిచింతల స్పెషల్ కలెక్టర్ నిరంజన్, డ్వామా పీ.డీ. దామోదర్‌రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అధికారంలోకి రావడమే లక్ష్యం
సూర్యాపేట: భారతీయ జనతా పార్టీ బలోపేతానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పార్టీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై తొలిసారిగా సూర్యాపేటకు వచ్చిన సందర్భంగా సంకినేని వెంకటేశ్వర్రావుకు సోమవారం పట్టణంలోని హైమాగార్డెన్లో సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. తనకు ఏనాడూ జిల్లా అధ్యక్ష పదవిపై ఆశ లేదని, రాష్ట్ర నాయకత్వం అప్పగించడంతోనే స్వీకరించానని, తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. బంగారు తెలంగాణ అని చెబుతూ సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కష్టపడి కాకుండా ఇష్టపడి రాజకీయం చేసే వ్యక్తి సంకినేని అనిఅన్నారు. అంతకు ముందు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు. పట్టణ అధ్యక్షుడు హబీద్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మధుసూదన్‌రెడ్డి, మల్లేశం, సులోచన, ఓరుగంటి రాములు, సాంబయ్య, గోలి ప్రభాకర్, కూతురు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు లింగయ్య, రాములు, కొణతం సత్యనారాయణరెడ్డి, పాండురంగాచారి, నల్లగుంట్ల అయోద్య, రుక్మారావు, సుజాత, కాసోజు సుమలత, కొండేటి ఏడుకొండల్, రంగినేని ఉమాలక్ష్మణ్‌రావు, చల్లమల్ల నర్సింహ్మ, కిషన్, వెంకట్‌రెడ్డి, రామగిరి నగేష్, భాస్కర్, నర్సింహ్మరెడ్డి, ఉప్పు శ్రీనివాస్, జీడి భిక్షం, గార్లపాటి మమతారెడ్డి, రాణి, వీరేంద్ర, కిరణ్, ఫణినాయుడు, నరేష్, అనంతుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మొక్కల పూర్తి వివరాలతో హాజరుకావాలని అధికారులకు సూచించారు. నాటిన ప్రతి మొక్క వివరాలను పూర్తిస్థాయిలో క్రోడీకరించి సేకరించాలని నియోజకవర్గ ఇన్చార్జి అధికారులను కోరారు. 65వ జాతీయ రహదారి వెంట నాటిన ప్రతి మొక్కకు 30 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి మొక్కలను సంరక్షిస్తున్నట్లు వివరించారు. వర్షాలుపడని చోటట్యాంకర్లను ఉపయోగించి నీటిని సరఫరా చేసి మొక్కలను కాపాడాలని సూచించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమ అమలు జరుగుతున్న విధానంపై ఆకస్మిక తనిఖీలు చేస్తారని తెలిపారు. అధికారులు అప్రమత్తతో పనిచేసి జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కొన్ని శాఖల్లో ఇంకా మందకొడిగా పనులు నడుస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినందున వెంటనే సంబంధిత శాఖల అధికారులు పనులు వేగవంతంగా చేయడానికి కృషి చేయాలని సూచించారు. ఇప్పటివరకు నాటిన ప్రతి మొక్కను సంరంక్షించడానికి ఫెన్సింగ్ 15 శాతం మాత్రం జరిగిందని, మిగతా పనులు వేగవంతం చేసి ఫెన్సింగ్‌ను ప్రతి మొక్కకు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏజేసీ వెంకట్రావు, డీఆర్వో రవి, పులిచింతల స్పెషల్ కలెక్టర్ నిరంజన్, డ్వామా పీ.డీ. దామోదర్‌రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.