రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
తిరుమలగిరి : రుణమాఫీ సక్రమంగా అమలు చేయకపోవడం, సకాలంలో రుణాలు అందక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు.
తిరుమలగిరి : రుణమాఫీ సక్రమంగా అమలు చేయకపోవడం, సకాలంలో రుణాలు అందక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఈ రెండు సంవత్సరాల పేరు మీద కేవలం 140 మందికి మాత్రమే భూ పంపిణీ చేశారని ఆరోపించారు. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూంలంటూ ఆశ చూపి ఒక్క ఇల్లు కూడా కట్టించ లేదని ఆరోపించారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌లో జరిగే మోడీ సభకు బూత్‌కు ఐదుగురు చొప్పున హాజరు కావాలని పిలుపునిచ్చారు. 2019 వరకు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కి బీజేపీ పార్టీయే ప్రత్యామ్నాయమని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడుచుకుపోయిందని, కాంగ్రెస్ పార్టీ లేవలేకుండా ఉందని ఆరోపించారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు కె.సోమయ్య, ధీన్‌దయాళ్, జయచందర్, జీడి భిక్షం, వెంకన్న, యాదగిరి, సుభాష్‌రెడ్డి, అబ్బాస్, సందీప్‌నేత, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.