ఆనం సోదరులకు షాక్ : వైఎస్ఆర్సిపిలో చేరిన పెంచల్రెడ్డి
హైదరాబాద్: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోదరులకు నెల్లూరులో పెద్ద షాక్ తగిలింది. వారి ప్రధాన అనుచరుడు సన్నపురెడ్డి పెంచల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రాష్ట్ర వంటనూనె వర్తకుల సంఘం అధ్యక్షుడైన పెంచల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి, ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి సమక్షంలో ఈ రోజు పార్టీలో చేరారు. ఆయనతోపాట వివిధ వ్యాపార సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు కూడా వైఎస్ఆర్ సిపిలో చేరారు.