కర్ణాటక మంత్రి సంతోష్ లాడ్ రాజీనామా
సాక్షి, బెంగళూరు: అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక సమాచార, ప్రాథమిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి సంతోష్ లాడ్ శుక్రవారం రాత్రి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజీనామా లేఖను సమర్పించారు.
సంతోష్ లాడ్ భాగస్వామ్యంలోని మైనింగ్ సంస్థ అక్రమ మైనింగ్‌కు పాల్పడిందంటూ సామాజిక వేత్తలు హీరేమఠ్, అబ్రహాం ఆరోపణలు చేయడంతో పాటు సాక్ష్యాధారాలను గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్‌కు అందజేశారు. బెల్గాంలో సోమవారం నుంచి శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లాడ్ అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజీనామా చేయాలంటూ ముఖ్యమంత్రి సూచించడంతో లాడ్ ఆ పని చేయాల్సి వచ్చింది.