saraswati cements lands
-
'టీడీపీ విషసంస్కృతిని అమలు చేస్తోంది'
హైదరాబాద్: కొత్త రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికార టీడీపీ విషసంస్కృతిని అమలు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. రైతుల భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. దీనిపై అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నవాళ్లు దౌర్జన్యాలు చేస్తున్నారని అంబటి రాంబాబు వాపోయారు. కాగా, సరస్వతి సిమెంట్స్ భూములను తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలనే వివాదాస్పదం చేస్తున్నారని గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అవి పూర్తిగా కొనుగోలు చేసి, రిజిస్టర్ చేసుకున్న భూములని ఆయన స్పష్టం చేశారు. -
'సరస్వతి' భూములపై లేనిపోని వివాదం
సరస్వతి సిమెంట్స్ భూములను తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలనే వివాదాస్పదం చేస్తున్నారని గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అవి పూర్తిగా కొనుగోలు చేసి, రిజిస్టర్ చేసుకున్న భూములని.. వాటిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సాగు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన తమ పార్టీ వాళ్లపై దాడి చేశారని, ఇప్పుడు మళ్లీ అక్కడ బాంబులు దొరికాయంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రామకృష్ణారెడ్డి విమర్శించారు.