సర్వాయి పాపన్న జయంత్యుత్సవాలు
షాద్‌నగర్: సర్దార్ సర్వాయి పాపన్న జయంత్యుత్సవాలను పట్టణంలోని యూనివర్సల్ మినీ ఫంక్షన్ çహాల్లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి పాపన్న అన్నారు. 12మంది అనుచరులతో 12వేల సైన్యాన్ని తయారు చేసుకొని గోల్కొండ కోటపై దండయాత్ర చేసి కోటను స్వాధీనం చేసుకున్నాడన్నారు. పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించాలన్నారు. దేశంలో అధునికీకరణకు నోచని ఏకైక వత్తి గీత వత్తి అన్నారు. గీతకార్మికులు రాజకీయంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దూరి అశోక్‌గౌడ్, మణికొండ రంగయ్యగౌడ్, గోవర్ధన్‌గౌడ్, కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్, రాములుగౌడ్, కట్టవెంకటేష్, రాఘవేందర్‌గౌడ్, దర్శన్‌గౌడ్, మహేష్‌గౌడ్, యాదయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.