ఎంసెట్ కౌన్సెలింగ్‌కు వెళుతూ మృత్యు ఒడిలోకి..
కలవచర్ల (నిడదవోలు): ఎంసెట్ కౌన్సెలింగ్‌కు వెళుతూ ఓ విద్యార్థి దుర్మరణం పాలైన ఘటన నిడదవోలు మండలంలోని కలవచర్ల గ్రామ శివారున ఉన్న పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామానికి చెందిన సత్తి నాగదుర్గ శాంతికుమార్ (22) ఇంటర్మీడియెట్ పూర్తిచేశాడు. కాకినాడలో ఎంసెట్ కౌన్సెలింగ్‌కు వెళ్లేందుకు ఉదయం తన స్నేహితుడు బండారు సారుు నరేంద్రతో కలిసి మోటార్‌సైకిల్‌పై బయలుదేరాడు.
కలవచర్ల శివారును ఉన్న బంకు వద్ద పెట్రోల్ పోరుుంచుకుని నిడదవోలు వైపుగా బంకులో నుంచి బయటకు వస్తున్నాడు. అదే సమయంలో నిడదవోలు నుంచి పెరవలి మండలం ఖండవల్లివైపు వెళుతున్న కారు వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. దీంతో మోటార్‌సైకిల్ ఎగిరిపడగా నాగదుర్గ శాంతి కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున బండారు సాయినరేంద్ర స్వల్పగాయూలతో ప్రాణాలు దక్కించుకున్నాడు. నిడదవోలు రైల్వేస్టేషన్ వరకూ మోటార్ సైకిల్‌పై వచ్చి అక్కడి నుంచి రైలులో కాకినాడ వెళ్దామని వీరు అనుకున్నారు.
తమతో సరదాగా మాట్లాడిన శాంతికుమార్ కొద్దిక్షణాల్లోనే దుర్మరణం పాలవ్వడం జీర్ణించుకోలేకపోతున్నామని బంకు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. కానూరుకు చెందిన సత్తి సత్యనారాయణ, మంగతాయారు దంపతులకు ముగ్గురు కుమారులలో నాగదుర్గ శాంతి కుమార్ పెద్దవాడు. చిన్నతనంలోనే తం డ్రి సత్యనారాయణ మరణించడంతో శాంతికుమార్ కానూరులో తాతయ్య ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ దుర్ఘటనతో ఆ కుటుంబసభ్యుల రోదనలు మిన్నం టారుు. నిడదవోలు రూరల్ ఎస్సై నరేంద్రకుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుని మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.