సెస్ పర్సన్ ఇన్చార్జిగా జగన్మోహన్రెడ్డి
సిరిసిల్ల, న్యూస్‌లైన్ : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) పర్సన్ ఇన్చార్జిగా కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాసులు ఉత్తర్వులు జారీ చేశారు. సెస్ పరిపాలన బాధ్యతలను త్రీమెన్ కమిటీకి అప్పగిస్తూ.. డెరైక్టర్లుగా పాత సత్యలక్ష్మి, పత్తిపాక లక్ష్మీరాజంలను నియమించారు. త్రీమెన్ కమిటీ 2013 ఆగస్టు 14 నుంచి ఆరునెలల పాటు కొనసాగనుంది. ఈలోగా ఎన్నికలు జరిగితే కమిటీ రద్దవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన జగన్మోహన్రెడ్డి గతంలో సెస్ డెరైక్టర్‌గా పని చేశారు. సిరిసిల్లకు చెందిన పత్తిపాక లక్ష్మీరాజం కౌన్సిలర్‌గా బాధ్యతలు నిర్వహించారు. వేములవాడకు చెందిన సత్యలక్ష్మి కాంగ్రెస్ మండల అధ్యక్షురాలిగా కొనసాగారు. సెస్ అడ్మినిస్ట్రేటర్‌గా పని చేసిన నాగుల సత్యనారాయణగౌడ్ నియామకంపై డి.ప్రభాకర్‌రావు హైకోర్టుకు వెళ్లగా, ఆ నియామకం చెల్లదని కోర్టు స్టే విధించింది. ఇటీవల స్టే తొలగిపోగా సెస్ అడ్మినిస్ట్రేటర్ పదవీకాలం ముగిసింది. దీంతో సెస్ పర్సన్ ఇన్చార్జిగా జగన్మోహన్రెడ్డితోపాటు త్రీమెన్ కమిటీని ప్రభుత్వం నియమించింది.