savita devi
-
15 సంవత్సరాల తర్వాత రైలెక్కిన భారత రాష్ట్రపతి
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం రైలు ప్రయాణం చేశారు. తన సతీమణి సవితాదేవితో కలిసి తమ స్వస్థలం కాన్పూర్‌కు రైలులో బయలు దేరారు. దిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వేస్టేషన్లో ప్రత్యేక రైలు ఎక్కిన రాష్టపతి దంపతులకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్, రైల్వేబోర్డు చైర్మన్, సీఈఓ సునీల్ శర్మ వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా స్వగ్రామానికి వెళ్తున్నట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. 15 సంవత్సారాల తర్వాత భారత రాష్టపతి రైలు లో ప్రయాణం చేయడం ఇదే తొలిసారి. అంతకుముందు 2006లో అప్పటి భారత రాష్టపతి అబ్దుల్ కలాం ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు రైలులో ప్రయాణించారు. కాన్పూర్ దేహాట్ మార్గంలోని జిన్జాక్, రురా వద్ద ఈ ప్రత్యేక రైలు కొద్దిసేపు ఆగనుంది. రాష్టపతి రామ్‌నాథ్ కోవింద్ తన పాత పరిచయస్థులను,తన పాఠశాల స్నేహితులను కలిసి మాట్లాడనున్నారు. ఆ తరువాత తన స్వగ్రామానికి చేరుకుంటారు. స్వగ్రామాన్ని సందర్శించిన అనంతరం జూన్ 28వ తేదీన కాన్పూర్ సెంట్రల్ రైల్వేస్టేషనులో రైలు ఎక్కి లక్నోకు చేరుకుంటారు. లక్నో పర్యటన అనంతరం జూన్ 29వ తేదీన రామ్‌నాథ్ ప్రత్యేక విమానంలో లక్నో నుంచి ఢిల్లీకి తిరిగి రానున్నారు. చదవండి: ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించిన సుప్రీంకోర్టు -
క్యారమ్ చాంప్ సవితాదేవి
చిలుకలూరిపేట: సౌత్‌జోన్ ఇన్విటేషన్ క్యారమ్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి ఎ. సవితాదేవి చాంపియన్‌గా నిలిచింది. ఇక్కడి సీఆర్ క్లబ్లో ఆదివారం జరిగిన మహిళల ఫైనల్లో సవిత 25-0, 25-13తో ఎల్.హరిప్రియా (ఏపీ)పై అలవోక విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో ఆమె 25-9, 25-0తో హుస్నా సమీర (ఏపీ)పై, హరిప్రియా 25-17, 25-16తో తనూజ (ఏపీ)పై నెగ్గారు. పురుషుల విభాగంలో హైదరాబాద్ ఆటగాళ్లు సయ్యద్ నయ్యర్, అనిల్ కుమార్, ఆదిత్యలు క్వార్టర్ ఫైనల్లోనే నిష్ర్కమించారు. సయ్యద్ 11-25, 17-25తో భారతీదాసన్ (తమిళనాడు) చేతిలో, అనిల్ 25-20, 1-25, 12-13తో సాగయ్య భారతి (తమిళనాడు) చేతిలో, ఆదిత్య 10-25, 14-22తో రాధాకృష్ణన్ చేతిలో కంగుతిన్నారు. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను భారతీదాసన్ గెల్చుకున్నాడు.