చాంపియన్ షిప్లో సైనా జోరు
జకర్తా: భారత్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఈ రోజు జరిగిన ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లో జపాన్ క్రీడాకారిణి సయాక తకహషిపై 21-18, 21-14 తేడాతో విజయం సాధించింది. 14వ సీడ్ ప్లేయర్‌పై జరిగిన ఈ మ్యాచ్ లో రెండో సీడ్ సైనా వరుసగా రెండు సెట్లు కైవసం చేసుకుని 42 నిమిషాల్లోనే ఆటముగించింది.
తొలి గేమ్ లో 7-0 తో వెనుకంజలో ఉన్న సైనా ఆ తర్వాత అత్భుత పోరాట పటిమను ప్రదర్శించి సెట్ ను గెలిచింది. ఇప్పటి వరకూ ఒక్క పతకాన్ని గెలవని సైనా ఈ సారి మాత్రం పతకంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరోవైపు సింధూ కూడా క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది.