జీఎం వస్తున్నారని రైలును ఆపేశారు
శావల్యాపురం (గుంటూరు) : దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో గుంటూరు నుంచి డోన్ వెళ్లే ప్యాసింజర్ రైలును ఆకస్మికంగా నిలిపివేశారు. దీంతో గుంటూరు జిల్లాలోని శావల్యాపురం స్టేషన్లో శుక్రవారం మధ్యాహ్నం 45 నిముషాలకు పైగా రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జీఎం రవీంద్రగుప్తా నరసారావుపేట స్టేషన్‌ను సందర్శించారు. అలాగే అచ్చంపల్లి రైల్వే గేట్‌ను పరిశీలించారు.