Search for places
-
జెడ్పీ కార్యాలయం కోసం అధికారుల వేట
సాక్షి, వరంగల్ రూరల్: నూతన జిల్లా పరిషత్ పాలక వర్గం ఏర్పాటైంది. కానీ ఆ పాలక వర్గానికి కార్యాలయం లేదు. జిల్లా పరిషత్ పాలకవర్గం కొలువుదీరేందుకు కొత్త జిల్లాల్లో జెడ్పీ భవనాలు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం, జిల్లా పరిషత్ భవనం ఏర్పాటుకై అన్వేషణ మొదలుపెట్టింది. జూలై 5వ తేదీన నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టనుంది. ఈ లోపు జిల్లా పరిషత్ భవనాన్ని ఏర్పాటు చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు పలు భవనాలను పరిశీలిస్తున్నారు. జిల్లాలో 16 జెడ్పీటీసీలకు గాను 16 జెడ్పీటీసీలను టీఆర్ఎస్ పార్టీనే దక్కించుకోవడంతో జిల్లా పరిషత్ పీఠం సైతం టీఆర్ఎస్ పార్టీనే దక్కించుకుంది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా గండ్ర జ్యోతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అన్నీ కార్యాలయాలు అర్బన్‌లోనే.. వరంగల్ రూరల్ జిల్లాకు జిల్లా కేంద్రం లేకపోవడంతో అన్నీ కార్యాలయాలు అర్బన్ జిల్లాలోనే ఏర్పాటు చేశారు. అర్బన్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాల కాంప్లెక్స్ నూతన భవనం నిర్మాణం అవుతుండటంతో ప్రభుత్వ, అద్దె భవనాల్లోకి మార్చారు. రూరల్ జిల్లాకు చెందినవి సైతం కొన్ని ప్రభుత్వ భవనాల్లో, మరికొన్ని అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు జిల్లా పరిషత్ కార్యాలయం కోసం వేట ప్రారంభించారు. అద్దె భవనంలో ఏర్పాటు చేయాలా....ఏదైన ప్రభుత్వ భవనం ఉంటే అందులో కార్యాలయం, మీటింగ్ హాల్‌ను ఏర్పాటు చేయాలా అని జిల్లా యంత్రాంగం ఆలోచిస్తున్నారు. కొత్త జిల్లా ప్రతిపాదికనే.. కొత్త జిల్లాల వారీగా జిల్లా పరిషత్‌లను ఏర్పాటు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నికైన జిల్లా, మండల పరిషత్ పాలకవర్గాల పదవీకాలం త్వరలో ముగుస్తుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు జిల్లాలుగా విభజించారు. వరంగల్ రూరల్ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలున్నాయి. వీటిలో దామెర, నడికూడ మండలాలు ఏర్పాటు అయ్యాయి. పాత మండలాలకు మండల పరిషత్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ రెండు కొత్త మండలాలకు మండల పరిషత్ కార్యాలయాలు లేవు. రెండు కొత్త మండలాలకు సైతం మండల పరిషత్‌లు ఏర్పాటు చేసేందుకుందు ఏర్పాట్లు చేస్తున్నారు. కొనసాగుతున్న కసరత్తు జిల్లాల విభజన, కొత్త మండలాల ఏర్పాటు, తండాలు, గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వం ఒకొక్కటిగా విభజిస్తూ వస్తుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జిల్లాల విభజన జరిగినప్పటికీ జిల్లా పరిషత్ ఉమ్మడి జిల్లాల కిందనే కొనసాగుతూ వస్తున్నాయి. త్వరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవికాలం ముగియనున్నందున ఆలోపు కొత్త జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జెడ్పీ కార్యాలయానికి ప్రత్యేక భవనం కోసం సంబంధిత శాఖ అధికారుల పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది. హన్మకొండ మండల పరిషత్ కార్యాలయంలో వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఏర్పాటు చే యాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జెడ్పీ కార్యాలయం కోసం మూడు భవనాలను పరిశీలించినట్లు సమాచారం. ఈ కార్యాలయాల నుంచే ఎన్నికల ప్రక్రియ కొనసాగించడంతో పాటు పాలకవర్గం కొలువుదీరేటట్లు భవనం సిద్ధం చేస్తున్నారు. -
భూముల కోసం వేట
- ఫిలింసిటీ కోసం స్థలాల అన్వేషణ - జిల్లా యంత్రాంగానికి సినిమా కష్టాలు - భూ లభ్యతపై సందేహాలు - జవహర్‌నగర్‌పై యంత్రాంగం మొగ్గు - దీంతోనైనా అక్రమాలకు కళ్లెం వేయవచ్చని అంచనా సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘ఫిలింసిటీ’ ఏర్పాటుపై జిల్లా యంత్రాంగం తర్జనభర్జనలు పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ సిటీని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై కసరత్తు చేస్తోంది. తెలంగాణలో చలనచిత్ర రంగాన్ని ప్రోత్సహించేందుకు వేయి ఎకరాల విస్తీర్ణంలో ఫిలింసిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే అనువైన భూములను గుర్తించాలని జిల్లా యంత్రాంగానికి మౌఖిక ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో భూ లభ్యతపై దృష్టి సారించిన రెవెన్యూ యంత్రాం గం.. ఒకేచోట ఆ స్థాయిలో భూసమీకరణ అంత సులువుకాదని భావిస్తోంది. నల్గొండ-రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని రాచకొండ గుట్టల్లో ఫిలింసిటీని ఏర్పాటు చేయాలని యోచించినప్పటికీ, అట వీ ప్రాంతం కావడం.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే ఆలోచన ఉన్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీపాద నాయక్ ప్రకటించిన నేపథ్యం లో.. రాచకొండ విషయంలో సాధ్యాసాధ్యాలపై అంచనా వేస్తోంది. అటవీ ప్రాంతంలో బిట్లు బిట్లుగానేవేయి ఎకరాలు లభిస్తుంది తప్ప నిర్దేశిత స్థాయి లో భూమి అందుబాటులోలేదని రెవెన్యూ యం త్రాంగం అంటోంది. అంతేగాకుండా రిజర్వ్ ఫారెస్ట్ కు నిర్దేశించిన ప్రాంతంలో కట్టడాలు, రోడ్ల నిర్మాణాలపై ఆంక్షలు ఉన్నందున.. ఈ ప్రాంతంలో ఫిలింసిటీ నిర్మించాలనే ఆలోచన సరికాదని చెబుతోంది. దీంతో పలు ప్రత్యామ్నాయాలను అన్వేషిం చిన జిల్లా యంత్రాంగం ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టుకు చేరువలో ఫిలింసిటీ ఉండేలా ప్రతిపాదనలు రూపొందించింది. శంషాబాద్ పరిసరాల్లో ఫిలింసిటీని ఏర్పాటు అంశాన్ని పరిశీలించినప్పటికీ, ఈ ప్రాంతం 111జీవో పరిధిలో ఉండడంతో యోచనను విరమించుకుంది. షాబాద్ మండలం సీతారాంపూర్‌లోని దేవాదాయశాఖ భూముల్లో కూడా ఫిలింసిటీని ప్రతిపాదిస్తే ఎలా ఉంటుందనే అంశం పై కూడా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జాతీయ రహదారి, ఔటర్ రింగ్ రోడ్డు, విమానాశ్రయానికి చేరువలో ఈ చోటు ఉండడం సానుకూలంగా మారుతుందని భావిస్తోంది. జవహర్‌నగర్ వైపు మొగ్గు! ఫిలింసిటీ ఏర్పాటుకు పలు భూములను పరిశీలి స్తున్న యంత్రాంగం జవహర్‌నగర్ భూములపై దృష్టిసారించింది. నగరానికి సమీపంలో ఉండడం తో ఈ ప్రాంతంపై ఆసక్తి కనబరుస్తోంది. సుమారు 3వేల ఎకరాల భూమి ఒకే చోట లభించే అవకాశం ఉండడం.. సమీప ప్రాంతంలో విమానాశ్రయాన్ని కూడా నిర్మించాలనే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉండడంతో జవహర్‌నగర్ భూముల ను ఫిలింసిటీకి కేటాయించేందుకు యంత్రాంగం మొగ్గు చూపుతోంది. దాదాపు 5వేల ఎకరాల విస్తీ ర్ణం కలిగిన ఈ ప్రాంతంలో దాదాపు 2వేల పైచిలు కు ఎకరాల్లో ఆక్రమణలు వెలిశాయి. ఈ కట్టడాలను తొలగించడం.. అక్రమార్కులు మళ్లీ నిర్మించుకోవడం షరా మామూలుగా మారిన తరుణంలో.. ఈ భూములను ఫిలింసిటీకి కేటాయించడమే ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.