వైభవంగా కోదండరాముడి కల్యాణం
ఒంటిమిట్ట రామాలయం (రాజంపేట) : రెండవ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట కోదండరామాలయంలో రంగమండపంలో దాశరథి కల్యాణం కమనీయంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా ఈ కల్యాణోత్సవం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు విచ్చేశారు. టీటీడీవారు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ సంప్రదాయ విధానంలో సీతరాముల కల్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.