9వ తరగతి నుంచే వృత్తి విద్య!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 9వ తరగతి నుంచే వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రీయ మాధ్యమిక అభియాన్‌పై (ఆర్‌ఎంఎస్‌ఏ) బుధవారం డీఈఓలతో జరిగిన సమావేశంలో దీనిపై చర్చించింది. వివిధ రంగాల్లో 810 వరకు వృత్తి విద్యా కోర్సులు ఉండగా, అందులో రాష్ట్రంలో 9, 10, 11, 12 తరగతుల్లో ప్రవేశపెట్టేందుకు వీలైనవాటిని, అందుకు అనుగుణమైన సిలబస్ రూపకల్పన వంటి అంశాలపై దృష్టి సారించాలని విద్యాశాఖ భావిస్తోంది. అయితే వీటిపై ప్రభుత్వంతో మరోసారి చర్చించాక ప్రతిపాదనలను ఖరారు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది.