తాడ్బన్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మేయర్
హైదరాబాద్ : నగరంలో కలకలం రేపిన తాడ్బన్ రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని మేయర్ పరిశీలించారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్బన్ వద్ద ఉన్న ప్రమాదకర మలుపును బుధవారం మేయర్ బొంతు రామ్మోహన్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నతో పాటు పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు.
తాడ్బన్ మూలమలుపు వద్ద చెట్ల కొమ్మలు తొలగించడంతో పాటు, సమీపంలోని నాలాను వెంటనే తొలగించాలని మేయర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.