ఐఎస్ ఆధీనంలోకి లిబియా
ఐరాస హెచ్చరిక
న్యూయార్క్: లిబియాలో ఐఎస్ వేగంగా విస్తరిస్తోందని ఐక్యరాజ్యసమితికి చెందిన భద్రతామండలి నిపుణులు తెలిపారు. స్థానిక తెగల నుంచి యువతను ఐఎస్ చేర్చుకుంటోందని, వారికి భద్రతతో పాటు తాయిలాలు ఎరవేస్తుందని తాజా నివేదిక లో వెల్లడించింది. మాజీ అధ్యక్షుడు గడ్డాఫీ హయాంలో పనిచేసిన సైనికాధికారులు కూడా ఐఎస్లో చేరినట్లు నిపుణుల కమిటీ నిర్ధారించింది.
నివేదిక ప్రకారం... లిబియాలోని సిర్త్రేలో ఐఎస్ పాతుకుపోవడంతో పాటు రాజకీయంగా, సైనికపరంగా కీలకపాత్ర పోషిస్తుంది. రాజధాని ట్రిపోలీతో పాటు సబ్రత నగరానికి ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు విస్తరించాయి.స్థానిక యువతతో పాటు టర్కీ, ట్యునీషియా నుంచి ఉగ్రవాదులు ఐఎస్లో చేరుతున్నారని తెలిపిం ది. ఐఎస్ రసాయన ఆయుధాల స్థావరాలపై అమెరికా సంకీర్ణ సేనలు వైమానిక దాడులు జరిపాయని పెంటగాన్ తెలిపింది.