వ్యవసాయ సేవలు బంద్
► నిలిచిపోయిన ఎరువులు, విత్తన లైసెన్స్ లు
►జిల్లాల పునర్విభజనతో కొత్త ఇబ్బందులు
► ఆన్ లైన్ లో కనిపించని 61 మండలాలు
సాక్షి, వరంగల్: పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేపట్టిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖలో మార్పులు చేయలేదు. దీంతో వ్యవసాయ విస్తరణ సేవలు, ఎరువులు, విత్తనాల విక్ర యాల కోసం ఇచ్చే లైసెన్స్ ల జారీలో కొత్త సమస్యలు వచ్చాయి. జిల్లాల పునర్విభజన లో మారిన మండలాల్లో విత్తనాలు, ఎరు వుల విక్రయాల లైసెన్స్ ల ప్రక్రియ నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 61 మండలాల్లో విత్తనాలు, ఎరువుల లైసెన్స్ ల జారీ ఆగిపోయింది.
ఆన్ లైన్ లో జారీ
పారదర్శకత కోసం వ్యవసాయ శాఖ విత్తనాలు, ఎరువుల లైసెన్స్ జారీ ప్రక్రియను ఆన్ లైన్ లో జారీ చేస్తోంది.లైసెన్స్ లు అవసరమైన వారు... అవసరమైన గ్రామం, మండలం, జిల్లా పేర్లను పేర్కొంటూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసేవారు. అధికారులు వాటిని పరిశీలించి గడువులోపులైసెన్స్ లను జారీ చేసేవారు. ఇప్పుడు వ్యవసాయ శాఖ పరంగా మండలం, డివిజన్, జిల్లాల యూనిట్లుగా పరిపాలన సాగుతుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒక్కో అసెంబ్లీ నియో జకవర్గాన్ని ఒక యూనిట్‌గా మార్చారు. ఉమ్మడి జిల్లా నుంచి మరొక జిల్లాల్లోకి మారిన మండలాల్లో సాంకేతికంగా సమస్య ఉంది. పాత ఉమ్మడి జిల్లాల్లో పరస్పరం మారిన మండలాల్లో వ్యవసాయ శాఖ సేవల పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.