వాయలార్కు రెండు రాష్ట్రాల ఎన్నికల బాధ్యత
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర), తెలంగాణ ప్రాంతాల్లో పార్టీ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, కేంద్ర మంత్రి వాయలార్ రవికి పార్టీ అధినేత్రి సోనియా అప్పగించారు. ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ ప్రచారం, వ్యూహాల అమలు వంటివన్నీ ఆయన పర్యవేక్షణలోనే కొనసాగుతాయి. మంగళవారం హైదరాబాద్ వచ్చిన రవి వారం రోజులు ఇక్కడే ఉండనున్నారు. ఆయనకు వసతి, సహాయకులను సీమాంధ్ర పార్టీ కార్యాలయమే ఏర్పాటుచేసింది. మంగళవారం ఇందిరాభవన్లో జరిగిన సీమాంధ్ర అభ్యర్థులకు బీఫారాల పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీమాంధ్ర రెండో జాబితా విడుదలపై పార్టీ నేతలతో చర్చించారు.