సీమాంధ్ర ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్: సీమాంధ్రలో బుధవారం ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు డీజీపీ ప్రసాద రావు చెప్పారు. మద్యం, డబ్బు పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచామని, ఎన్నికల విధులకు మొత్తం 1.22 లక్షల మంది పోలీసుల బలగాలను మోహరించినట్టు ప్రసాద రావు చెప్పారు. నాలుగు హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్టు తెలిపారు.
తనిఖీల్లో ఇప్పటివరకు 131 కోట్ల రూపాయిలను స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ చెప్పారు. 48.50 కోట్లను తిరిగి ఇచ్చేశామని తెలిపారు. 90 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. 29,675 కోడ్ ఉల్లంఘన కేసులు, 5,938 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు డీజీపీ చెప్పారు.