సీమాంధ్రప్రదేశ్కు పేరేది?
నూతనంగా ఏర్పడే సీమాంధ్రప్రదేశ్కు బుద్ధప్రదేశ్గా పేరు పెట్టమని కోరటం విచిత్రంగా ఉంది. దీంట్లో కూడా మతం దాని చుట్టూ వివాదాలు చొరబడటం బాధాకరం. బ్రిటిష్ పరిపాలనా కాలం నుండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచమని ఆంధ్రులు కోరుతూ వచ్చారు. ఎట్టకేలకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నో దీక్షలు ఉద్యమాలు జరిపిన ఫలితంగా అమర జీవి పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష గావించి ప్రాణ త్యాగం అర్పించిన పిదప రాష్ట్రం ఏర్పడింది.
దాదాపు 6 దశాబ్దాల తరువాత ఆంధ్ర ప్రదేశ్ విభజనానంతరం మరోసారి నూతనంగా ఏర్ప డిన రాష్ట్రానికి పొట్టి శ్రీరాములు రాష్ట్రం అని పేరు పెట్ట మని న్యాయంగా ఆంధ్ర ప్రజలు కోరాలి. అంతేగాని రాష్ట్రంలో 50 వేల మంది బౌద్ధుల జనాభా కూడా లేని బౌద్ధమ తం పేరు పెట్టమని కొంత మంది మేధావులు, వ్యక్తులు కోరడం చిత్రవిచిత్రంగా ఉన్నది. మైనారిటీలు, దళితులు, క్రైస్తవులు, ముస్లింలు అధికంగా గల ఆంధ్రప్రదేశ్లో కేవలం 50 వేల మంది జనాభా కూడా లేని బౌద్ధమత ప్రతీక అయిన గౌతమ బుద్ధుని పేరు పెట్టమనటం సమంజసం కాదు. ఇప్పటికైనా ఇలాంటి వాదనలుమాని సకల వర్గాల ప్రజలు కలసి అమర జీవి పొట్టిశ్రీరాములు పేరును కొత్త రాష్ట్రానికి పెడితే ఆయన ఆత్మశాంతించే అవకాశం ఉంటుంది.
- వై.సత్యనారాయణ చీరాల, ప్రకాశం జిల్లా