చెరువులన్ని నిర్లక్ష్యానికి గురయ్యాయి: కేసీఆర్
హైదరాబాద్: సీమాంధ్ర పాలనలో చెరువులన్ని నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పూర్తి స్థాయిలో నీటి వినియోగానికి చెరువుల పునరుద్ధరణే ఏకైక మార్గం అని కీసీఆర్ అభిప్రాయపడ్డారు. చెరువులు లేకపోవడం వల్లనే రాష్ట్రానికి కేటాయించిన నదీ జలాలను పూర్తిగా వాడుకోలేకపోతున్నామన్నారు.
డిసెంబర్ లో చేపట్టబోయే మొదటి దశ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి 450 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే గ్రామల్లో మొదటగా చెరువులు పునరుద్ధరణ చేపడుతామన్నారు. స్కూల్, కాలేజిలో చెరువుల పునరుద్ధరణపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని కేసీఆర్ అన్నారు.