ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య
గంట్యాడ: విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కనకం గ్రామంలో ఓ ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లెంక సీతంనాయుడు(33) అనే వ్యక్తి బుధవారం వేకువజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి అనారోగ్యంగా ఉండడంతో ఇంటికి వచ్చిన సీతంనాయుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతికి కారణాలు తెలియలేదు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.