సార్వత్రిక సమ్మె విజయవంతం చేయండి
మక్తల్: సెప్టంబర్ 2న దేశ వ్యాప్త సమ్మేను విజయవంతం చేయాలని ఇఫ్టూ ఆధ్వర్యంలో మక్తల్లో బుధవారం పోస్టర్‡ విడుదల చేశారు. అనంతరం కార్యలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు ఏమాత్రం పరిష్కరించడం లేదని అన్నారు.నెలకు 18 వేల రూపాయాలు వేతనం ుఇవ్వాలని డిమాండ్ చేశారు.నిత్యావసర వస్తువల ధరలు విపరీతంగా పెరిగాయని విమర్షించారు. కాంట్రాక్టు పద్దతిని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇప్టూ నాయకులు కిరణ్, భుట్టో, రాము, శ్రీనువాసులు,లక్ష్మణ నర్సిములు,చెన్నయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.