సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్కు ప్రత్యేక బస్సులు
హైదరాబాద్: ఈ నెల 7వ తేదీన జరుగనున్న సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్కు హాజరయ్యే అభ్యర్థుల కోసం 500 బస్సులు అదనంగా నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తమ్ ఒక ప్రకటనలో తెలిపారు. వంద కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్న దృష్ట్యా అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొనే విధంగా ఉదయం 7 గంటల నుంచి 9.30 వరకు, తిరిగి సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు అదనపు బస్సులు అందుబాటులో ఉంటాయి. బస్సుల నిర్వహణ కోసం డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు.