‘ఇంట్లో ఏం తింటాం.. బయటికెళ్దాం’.. ఆసక్తికర నివేదిక
దేశంలో ప్రజల ఆహార అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. ఈటింగ్ అవుట్, ఫుడ్ డెలివరీలకు సంబంధించిన భారతదేశపు ఫుడ్ సర్వీస్ మార్కెట్‌పై ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ, మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ బైన్ సంయుక్తంగా ఓ అధ్యయనాన్ని నిర్వహించాయి. ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.దేశపు ఆహార సేవల మార్కెట్ వచ్చే ఏడేళ్లలో ఏటా 10–12% వృద్ధి చెందుతుందని, ఇది 2030 నాటికి రూ. 9–10 లక్షల కోట్లకు చేరుతుందని స్విగ్గీ-బైన్ నివేదిక తెలిపింది. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ. 5.5 లక్షల కోట్లుగా ఉందని, ఏడాది ప్రాతిపదికన ఇప్పటి వరకు ఉన్న 8–9% వృద్ధితో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉంటుందని నివేదిక పేర్కొంది. అంటే ఈ మార్కెట్లో ఉన్న కస్టమర్ బేస్ ప్రస్తుతం ఉన్న 33 కోట్ల నుంచి 2030 నాటికి 45 కోట్లకు చేరుతుంది.వేగంగా పెరుగుతున్న ఆన్లైన్ ఫుడ్ డెలివరీమొత్తం మార్కెట్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వృద్ధి గణనీయంగా పెరిగింది. 2019-2023 మధ్య కాలంలో ఇది 8% నుంచి 12%కి పెరిగింది. ఇది 18% రెట్టింపు వార్షిక వృద్ధి రేటుతో దాదాపు రూ. 2 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. 2030 నాటికి మొత్తం ఫుడ్ సర్వీస్ మార్కెట్లో 20% ఉన్న ‘ఈటింగ్ అవుట్’ కంటే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలు వేగంగా పెరుగుతున్నాయి.స్థూల ఆర్థిక పరిస్థితుల్లో వస్తున్న మార్పులను ఈ నివేదిక ఉదహరించింది. వేగవంతమైన పట్టణీకరణ, జెనరేషన్ జెడ్ అంటే పాతికేళ్లలోపు యువత కొనుగోలు శక్తి పెరుగుదలతో సహా, బయటి ఫుడ్ తినే ప్రవృత్తి ఉన్నాయి. నెలకు సగటున ఐదుసార్లు బయట తినే భారతీయులు ఎక్కువగా బయటే తినే అమెరికా, చైనా వంటి దేశాలను అనుసరిస్తున్నారని నివేదిక పేర్కొంది.