శేషాచలంలో రాళ్లు దొర్లి వ్యక్తి మృతి
మారేడు గడ్డల కోసం వెళ్లిన వ్యక్తి ప్రమాద వశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన వైఎస్సార్ జిల్లా సుండుపల్లి మండలం లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నల్లగుట్ట పల్లెకు చెందిన చంద్రయ్య మారేడు గడ్డల కోసం ఆదివారం ఉదయం శేషాచలం అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు.
గడ్డలు సేకరించే క్రమంలో అతనిపై బండరాళ్లు దొర్లడంతో.. వాటి కింద చిక్కకుని ప్రాణాలు కోల్పోయాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.