సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలి
కట్టంగూర్ ః వర్షాకాలంలో మూగజీవాలకు, పశువులకు వ్యాపించే వ్యాధుల పట్ల గొర్ల కాపరులు, రైతులు అవగాహన కలిగి ఉండాలని పశుసంవర్థక శాఖ జేడీ నర్సింహులు సూచించారు. గురువారం మండలంలోని ఈదులూరు, కట్టంగూర్ గ్రామాల్లో గొర్రెల మందలను ఆయన పరిశీలించారు. ఈదులూరు గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సీజన్లో గొర్రెలకు మూతివాపు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందన్నారు. గొర్రెలకు వ్యాధులు సంక్రమిస్తే వెంటనే పశువైద్యాధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి శైలజ, సిబ్బంది సంజయ్ పాల్గొన్నారు.