యువజన అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (మెట్రో) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువజన సర్వీస్ ద్వారా 2015–16 సంవత్సరానికి జాతి నిర్మాణం, సామాజిక సేవ అంశాల్లో విశిష్ట సేవలు చేసిన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలకు జాతీయ యువజన అవార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు సెట్వెల్ సీఈవో కె.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను నిర్ణీత ప్రొఫార్మాలో ముఖ్య కార్యనిర్వహణాధికారి, పశ్చిమగోదావరి జిల్లా సెట్వెల్ ఏలూరు అనే చిరునామాకు ఈ నెల 22 లోగా అందించాలన్నారు. వివరాలకు 08812– 238166 నంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు. దరఖాస్తు, ఇతర వివరాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. వైఎఎస్. ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్లో పొందాలని సూచించారు.