గీత స్మరణం
పల్లవి :
బృందం: డుండుం డుండుం డుండుం తక
డుండుం డుండుం డుండుం తకధిమి
॥
అతడు: డుండుండుం నటరాజు ఆడాలి
పంబ రేగాలిరా
జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా
గుండెల్లో గురివుంటే ఎదగాలి తారలే కళ్లుగా
నీ మాటే నీ బాటై సాగాలి సూటి సూరీడుగా
పామాట నుంచి భామాట దాకా
నాదేనురా పై ఆట
ఆడితప్పనేమాటా అయ్య చూపిన బాట
నమ్మినోళ్లకిస్తా నా ప్రాణం
॥
చరణం : 1
అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బా తొడగొట్టి చూపించరా (2)
బ్రహ్మన్నపుత్ర హే బాలచంద్ర చెయ్యెత్తి జై కొట్టరా
పొగరున్న కొండ వెలుగున్న మంట తెలుగోడివనిపించరా
వేసంగిలోన పూసేటిమల్లి నీ మనసు కావాలిరా
అరె వెలిగించరా లోనిదీపం
అహ తొలగించరా బుద్ధిలోపం
ఒహో ఆత్మేరా నీ జన్మతార
సాటి మనిషేరా నీపరమాత్మ
॥
చరణం : 2
చూపుంటే కంట్లో ఊపుంటే ఒంట్లో
నీకేంటి ఎదురంట (2)
నీవు నీకు తెలిసేలా
నిన్ను నీవు గెలిచేలా
మార్చాలిరా మనగీత
చిగురంత వలపో చిలకమ్మ పిలుపో
గుణపాఠం ఉండాలిరా
పెదవుల్లో చలి ఈల పెనవేస్తే చెలిగోల
చెలగాటం ఆడాలిరా
అహ మారిందిరా పాతకాలం
నిండు మనసొక్కటే నీకు మార్గం
॥
చిత్రం : మురారి (2001)
రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : మణిశర్మ, గానం : శంకర్‌మహదేవన్, బృందం
మహేష్‌బాబు... పోరాటం (1983) అనే చిత్రంలో బాల నటుడిగా తెలుగు సినీపరిశ్రమకు పరిచయమయ్యారు. తర్వాత కొన్ని సినిమాలలో బాల నటుడిగా అలరించారు. రాజకుమారుడు (1999) చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యారు. తన నటనకుగాను ఏడు నంది అవార్డులు, మూడు ఫిలింఫేర్ అవార్డులు, మరెన్నో సినీపరిశ్రమకు సంబంధించిన పలు అవార్డులు అందుకున్నారు. ‘వంశీ’ చిత్రంలో తనతో జట్టుకట్టిన నమ్రతా శిరోద్కర్ ను 2005లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి పిల్లలు గౌతమ్‌కృష్ణ, సితార.