రూ. 5 చోరీ.. కొడుకును తగలబెట్టేసిన తల్లి
ఆరేళ్ల వయసున్న కొడుకు.. చిరుతిండి కొనుక్కోడానికి 5 రూపాయలు దొంగిలించాడన్న కోపంతో.. అతడి తల్లి అతడిని తగలబెట్టేసింది. ఈ ఘటన రాజస్థాన్లోని బికనీర్ ప్రాంతంలో జరిగింది. తీవ్రంగా కాలిన గాయాలైన ఆ బాలుడు ప్రస్తుతం పీబీఎం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పెట్టె లోంచి తనకు తెలియకుండా 5 రూపాయలను తన కొడుకు తీస్తుండగా రుక్సానా అనే మహిళ చూసింది. దీంతో తీవ్రంగా కోపం వచ్చిన ఆమె.. అతడికి నిప్పంటించింది. ఇతర కుటుంబ సభ్యులు అదిచూసి వెంటనే అతడిని కాపాడి, ఆస్పత్రికి తరలించారు. ఆ మహిళపై నయా శహర్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అయితే ఇంతవరకు ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదు.