ఏడురోజుల నష్టాలకు బ్రేక్...
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో స్వల్ప లాభాలతో ముగిశాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడినా, వరుసగా ఏడు సెషన్ల నష్టాలకు చెక్ పెట్టి చివరకు సెన్సెక్స్, నిఫ్టీలు పాజిటివ్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 61పాయింట్ల లాభంతో 26,040వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో్ 7,985.75 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ మరోసారి 26వేల పాయింట్ల కీలక స్థాయిలో, నిఫ్టీ 8 వేలకు దిగువన ముగిసింది. కేపిటల్ గూడ్స్, ఆటోమొబైల్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు లాభాలను ఆర్జించాయి. దివీస్ కు షాక్ నేపథ్యంలో ఫార్మా నష్టపోగా ఐటీ, టెక్నాలజీ షేర్లతో పాటు స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ రంగాలు కూడా నష్టపోయాయి.రోజంతా సెన్సెక్స్ నారో బ్యాండ్ లోట్రేడ్ అయింది. దీంతో ఫారిన్ ఇన్వెస్టర్ల అమ్మకాల కారణంగా మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నట్టు విశ్లేషకుల అంచనా.
సిప్లా, బాష్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, సన్ ఫార్మా టాప్‌గెయినర్స్‌గా, హెచ్‌సీఎల్ టెక్ యాక్సిస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్ అరబిందో ఫార్మా టెక్ మహీంద్రా టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
అటు డాలర్ తో పోలిస్తే రూపాయి 16 పైసల లాభంతో రూ.67.83 వదఉంది. అలాగే ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి రూ.33 క్షీణించి, రూ.26,935 వద్ద ఆకర్షణీయంగా ఉంది.