ఆహారం, మందులపై పాకిస్థాన్ గుర్తులు!
ల్యాంగేట్ః ఉడీ తరహాలో మళ్ళీ దాడులకు ఉగ్రవాదులు యత్నించారు. గురువారం సైన్య శిబిరాలపై చొరుబాటుకు విఫల యత్నం చేశారు. కాశ్మీర్ ల్యాంగేట్ ప్రాంతంలోని సైనిక శిబిరంపై దాడికి యత్నించిన టెర్రరిస్టులను భారత జవాన్లు విజయవంతంగా తిప్పి కొట్టారు. దాడి సమయంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మిలిటెంట్లు మరణించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. వారివద్ద ఉన్న ఆహారం, మందుల ప్యాకెట్లపై పాకిస్థాన్ గుర్తులు ఉన్నట్లుగా ఆర్మీ అధికారులు గుర్తించారు.