నాలుగేళ్లలో ఏడో సారి
లక్నో: రానున్న ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మరో సారి మంత్రి వర్గ విస్తరణ జరుగనుంది. 2012లోఅఖిలేష్ యాదవ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇది ఏడో మంత్రి వర్గ విస్తరణ. గత కొంతకాలంగా మంత్రి వర్గ విస్తరణ జరుగనుందని ఊహా గానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. కొత్తగా కేబినేట్ లోకి చేరనున్న వారిని ఈనెల 27 న గవర్నర్ రామ్ నాయక్ ప్రమాణ స్వీకారం చేయిస్తారని గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
చివరిసారిగా 2015 అక్టోబర్ లో మంత్రి వర్గ విస్తరణ జరిగింది. ఇటీవల కేబినెట్ నుంచి సీనియర్ మినిస్టర్ బలరాం నాయక్ సస్పెన్షన్ కు గురవడం, గ్యాంగ్ స్టర్ గా ఉన్న ముక్తర్ అన్సారీ ఇటీవల పార్టీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ప్రాధాన్యం సంతరించుకుంది.