11 ఏళ్ల వయస్సులోనే అతన్ని ప్రేమించాను: ఆలియా
ముంబై: బాలీవుడ్ నటుడు షాహీద్ కపూర్ కు పెద్ద ఫ్యాన్ అని సినీనటి ఆలియా భట్ వెల్లడించింది. తన వయస్సు పదకొండేళ్లు ఉన్నపుడే తాను షాహిద్ కపూర్ ను ప్రేమించానని ఆలియా తెలిపింది. అప్పుడే ముంబైలోని జెయిటీ గెలాక్సీ థియేటర్ లో షాహీద్ నటించిన ఇష్క్ విష్క్ చిత్రం చూశానన్నారు. షాహీద్ లో గొప్ప నటుడు ఉన్నాడని ఆలియా తెలిపింది.
తాజాగా వికాస్ బెహల్ నిర్మిస్తున్న షాందార్ చిత్రంలో షాహీద్ సరసన నటించేందుకు అంగీకారం తెలిపినట్టు వచ్చిన వార్త నిజమేనంటూ ఆలియా ధృవీకరించింది. షాహీద్ ను సీనియర్ నటుడిగా చూడటం లేదని.. తాను రణదీప్ హుడాతో హైవే చిత్రంలో నటించిన విషయాన్ని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.
ఇటీవల తాను నటించిన వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, సిద్దార్థ్ మల్హోత్రాలకు సమకాలీకుడిగానే కనిపిస్తాడని షాహీద్ కు ఆలియా కితాబిచ్చింది. క్వీన్ చిత్రాన్ని అందించిన వికాస్ రూపొందిస్తున్న షాందార్ లో నటించడం తనకు ఆనందంగా ఉందని ఆలియా తెలిపింది.