బతుకమ్మ సంబరాల్లో కేసీఆర్ సతీమణి
హైదరాబాద్ : టీజీవో భవన్లో శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి బతుకమ్మ సంబరాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ భార్య శైలిమ, హరీష్రావు సతీమణి శ్రీనీత పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులతో కలిసి వీరంతా బతుకమ్మ ఆడారు. కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. ఈ వేడుకల్లో మంత్రి కేటీఆర్ కుమారుడు కూడా సందడి చేశారు.