Shanghai index
-
జాక్ మా వివాదాస్పద వ్యాఖ్యలు.. షాక్
సరిగ్గా రెండు రోజుల ముందు యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూకి చైనా అధికారులు షాకిచ్చారు. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీ తొలుత లిస్టింగ్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించగా.. తదుపరి హాంకాంగ్ మార్కెట్ సైతం ఇదే నిర్ణయాన్ని ప్రకటించింది. వెరసి 37 బిలియన్ డాలర్ల అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి తాత్కాలికంగా చెక్ పడింది. గురువారం అటు హాంకాంగ్, ఇటు షాంఘైలలో ఒకేసారి లిస్టింగ్ చేసే యోచనలో యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు చేపట్టింది. అయితే మంగళవారం రాత్రి షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీ ఇందుకు బ్రేక్ వేసింది. ఈ వార్తల ఫలితంగా మంగళవారం యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీలో అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ షేరు దాదాపు 10 శాతం పతనంకావడం గమనార్హం! అన్లైన్ లెండింగ్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యాంట్ గ్రూప్ ప్రమోటర్ జాక్ మా చైనీస్ బ్యాంకులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రభావం చూపినట్లు యాంట్ గ్రూప్ తాజాగా అభిప్రాయపడింది. యాంట్ గ్రూప్‌లో ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్‌నకు మూడో వంతు వాటా ఉంది. ఆన్లైన్లో మైక్రోరుణాలందించే యాంట్ గ్రూప్‌ను జాక్ మాకు చెందిన అలీబాబా గ్రూప్ ప్రమోట్ చేసింది. ఆన్లైన్ లెండింగ్పై సవరించిన ఫిన్‌టెక్ నిబంధనలు, లిస్టింగ్‌కు సంబంధించిన వివరాల వెల్లడిలో వైఫల్యం తదితర కారణాలతో యాంట్ గ్రూప్ లిస్టింగ్‌కు చైనీస్ నియంత్రణ సంస్థలు మోకాలడ్డినట్లు అక్కడి మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఫైనాన్షియల్ నియంత్రణ సంస్థల అధికారులు సోమవారం యాంట్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎరిక్ జింగ్‌తోపాటు.. సీఈవో సైమన్ హును ఆన్లైన్ లెండింగ్ బిజినెస్‌పై ప్రశ్నించినట్లు ఈ సందర్భంగా తెలియజేశాయి. చదవండి: యూఎస్ మార్కెట్లకు జో బైడెన్ జోష్ -
మందకొడిగా ట్రేడింగ్..
స్వల్పంగా తగ్గిన సూచీలు ముంబై: అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరిస్తూ శుక్రవారం రోజంతా మందకొడిగా ట్రేడింగ్ కొనసాగింది. చైనా షాంఘై సూచి భారీగా 3 శాతం పతనంకావడంతో ట్రేడింగ్ ప్రారంభంలో భారత్ సూచీలు కూడా అరశాతంపైగా తగ్గినప్పటికీ, కనిష్టస్థాయిలో కొద్దిపాటి కొనుగోలు మద్దతు లభించడం, వారాంతపు షార్ట్ కవరింగ్ జరగడంతో ట్రేడింగ్ ముగింపులో కాస్త కోలుకున్నాయి. 25,058-25,260 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 34 పాయింట్ల నష్టంతో 25,228 పాయింట్ల వద్ద ముగిసింది.నిఫ్టీ 2 పాయింట్ల స్వల్పనష్టంతో 7,733 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇటీవల చైనా నుంచి వెలువడిన తయారీ రంగ గణాంకాలతో ప్రపంచ ఆర్థికాభివృద్ధి పట్ల సందేహాలు ఏర్పడి, ఈక్విటీ ఇన్వెస్టర్ల ఆసక్తి సన్నగిల్లిందని, దాంతో మార్కెట్ కార్యకలాపాలు మందకొడిగా వున్నాయని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. గెయిల్ జోరు... సెన్సెక్స్ షేర్లలో అన్నింటికంటే ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ 4.99 శాతం ఎగిసింది. బీహెచ్ఈఎల్ 3.17 శాతం పెరగ్గా, ఆసియన్ పెయింట్స్, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 1-2.3 శాతం మధ్య పెరిగాయి. డాక్టర్ రెడ్డీస్ లాబ్, విప్రో, ఆదాని పోర్ట్స్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ అండ్ టీలు 1-2 శాతం మధ్య క్షీణించాయి. వరుసగా రెండోవారమూ డౌన్... స్టాక్ సూచీలు వరుసగా రెండోవారమూ తగ్గాయి. సెన్సెక్స్ అంతక్రితంవారంతో పోలిస్తే 378 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 116 పాయింట్లు క్షీణించింది.