మరోసారి బాయ్స్ టీమ్
స్టార్ దర్శకుడు శంకర్ సెల్యులాయిడ్ సృష్టిలో బాయ్స్ చిత్రం ఒకటి. ఆయన చేసిన ఒక కొత్త ప్రయోగం ఇది. శంకర్ మ్యాజిక్ ఆశించినంతగా పని చేయకపోయినా ఆ చిత్రం ద్వారా సిద్ధార్థ్, భరత్, నకుల్, తమన్, మణికంఠన్, నటి జెనీలియా సహా ఆరుగురు నూతన టాలెంటెడ్ తారలు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. వారిలో నటుడు మణికంఠన్ మినహా అంద రూ తమకంటూ ఒక గుర్తింపును పొందారు.
సిద్ధార్థ్, భరత్, నకుల్ హీరోలుగా రాణిస్తుండగా తమన్ సంగీత దర్శకుడుగా తమిళం, తె లుగు భాషల్లో రాణిస్తున్నారు. ఈ టీమ్ 13 ఏళ్ల తరువాత మరోసారి కలిసి పని చేయడానికి రెడీ అవుతున్నారన్న తాజా సమాచారం. ఈ విషయాన్ని తమన్ తన ట్విట్టర్లో పేర్కొనడం విశేషం.
13 ఏళ్ల తరువాత బాయ్స్ టీమ్ మళ్లీ కలిసి చిత్రం చేయనున్నాం. అంతా సవ్యంగా జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి ప్రకటన వెలువడనుంది. అని తమన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. సిద్ధార్థ్, భరత్,నకుల్ హీరోలుగా నటించనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి మహేంద్రన్ అనే నవ దర్శకుడు మెగాఫోన్ పట్టనున్నట్లు టాక్.