ఘనంగా ఉగాది వేడుకలు
సాక్షి, ముంబై: ఆంధ్రమహాసభలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం నిర్వహించిన శ్రీ జయనామ సంవత్సర ఉగాది వేడుకల్లో ముఖ్య అతిధిగా నాళేశ్వరం శంకరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతాలు వేరైనా భాష ఒక్కటేనని, అయితే ఆయా ప్రాంతాలు తమ యాసను గౌరవించుకొంటూ మిగతా ప్రాంతాల యాసను గౌరవించాలని తెలియచేశారు. సంవత్సరంలో ఆరు రుతువులకు షడ్రుచుల ఉగాది పచ్చడి ప్రతీక అని తెలిపారు.
ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్ సభకు స్వాగతం పలుకుతూ నూతన కార్యవర్గం మహసభకు పునర్వైభవం తెచ్చేందుకు కట్టుబడి ఉందని, నాణ్యత కలిగిన కార్యక్రమాలను నిర్వహిస్తామని హామీ ఉచ్చారు. జ్యోతి ప్రజ్వలానంతరం మోహన్ పండితుల ద్వారా పంచాంగ శ్రవణం జరిగింది. తర్వాత జరిగిన కవిసమ్మేళనానికి నాళేశ్వరం శంకరం అధ్యక్షత వహించారు. గౌరవ అతిథిగా ప్రముఖ శాస్త్రవేత్త నాగేశ్వరావు వేదికనలంకరించారు. ఈ కవి సమ్మేళనంలో అంబల్ల జనార్ధన్, సంగినేని రవీంద్ర, మచ్చ ప్రభాకర్, గాలి మురళీధర్, యు.కె. మేఘ, యెల్టి సుదర్శన్ పద్మశాలి, జ్వలిత, గుర్రపు కిషన్, ఏవీ అనంతరామ్, గట్టు నర్సయ్య, నడిమెట్ల యెల్లప్ప, పి. భారతలక్ష్మి, గుంటక పరుశురాం, గుర్రం బాలరాజు తదితరులు తమ కవితల్ని వినిపించారు.
ప్రముఖ రచయిత్రి తురగా జయ శ్యామల, డా. హరికిషన్ తెలుగు భాష గురించి వివరించారు. కవిసమ్మేళనానికి వ్యాఖ్యాతగా సాహిత్యవిభాగ ఉపాధ్యక్షుడు నడిమెట్ల యెల్లప్ప వ్యవహరించారు. వేదికపై అతిథులతో పాటు అధ్యక్షుడు సంకు సుధాకర్, ధర్మకర్తల మండలి కార్యదర్శి మంతెన రమేశ్, ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్ ఆసీనులయ్యారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీ చైర్మన్ ఏక్నాథ్ సంగం, సభ్యులు పోతు రాజారాం, పరిపాలనా శాఖ ఉపాధ్యక్షుడు అనుమల్ల రమేశ్, సాంస్కృతిక శాఖ ఉపాధ్యక్షుడు గట్టునర్సయ్య, కోశాధికారి రాంపెల్లి పరమేశ్వర్, బడుగు విశ్వనాథ్, సిరిమల్లె శ్రీనివాస్, రాంపెల్లి జ్ఞానేశ్వర్, తాటికొండ మోతీరాం, కస్తూరి హరిప్రసాద్, బైరం రాంమోహన్, మహిళా శాఖ అధ్యక్షురాలు పి. భరతలక్ష్మి, కార్యదర్శి సోమల్ లత, సభ్యులు సంగినేని విజయ, అపరాజిత, కరుణ, దేవీరావు, పి.పద్మ, వై.లత పాల్గొన్నారు.
కొడిమ్యాల్లో...
కొడిమ్యాల్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్థానికులకు పచ్చడి పంపిణీ చేశామని ఆ సంస్థ అధ్యక్షుడు మంచాల దేవయ్య, ప్రధాన కార్యదర్శి వేముల మనోహర్, కోశాధికారి గుర్రం శ్రీనివాస్ తెలిపారు.
బేలాపూర్‌లో.. బేలాపూర్‌లోని తెలుగు కళా వేదిక ఆధ్వర్యంలో జనార్ధన్ శాస్త్రి పంచాంగ శ్రవణం గావించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
భివండీలో..
భివండీ, న్యూస్‌లైన్: పద్మశాలి సమాజ్ యువక్ మండలి ఆధ్వర్యాన ప్రేమాతాయి మంగళ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా సాంస్కృతిక కార్యాక్రమాలు, గత నెల రోజుల క్రితం నిర్వహించిన పద్మశాలి క్రీడా మహోత్సావాలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా టాలీవుడ్ హీరోలు వేణు, రోషన్ బాలు, హాస్య నటుడు చిత్రం శ్రీనివాస్, అంక్యార్ బులెట్ పద్మినితో పాటు స్థానిక కార్పొరేటర్ సంతోష్ ఎం. శెట్టి, శశిలత శెట్టి, సభాపతులు మురళి మచ్చ, గాజెంగి రాజు తదితరులు హాజరయ్యారు. పద్మశాలి కులానికి చెందిన టాలీవుడ్ హీరో రోషన్ బాలు మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తెలంగాణ నుంచి వేళ్లపై లెక్కపెట్టేంతమందే హీరోలున్నారన్నారు.
రాబోయే కాలంలో తెలంగాణ చిత్రపరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి అవకాశం కల్పించిన కొండా బాపూజీని మనం తెలంగాణ జాతిపితగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో పద్మశాలి కులానికి చెందిన మాజీ కార్పొరేటర్లు దాసి అంబాదాస్, కళ్యాడపు బాలకిషన్, పాశికంటి లచ్చయ్య, వంగ పురుషోత్తం, కుందెన్ పురుషోత్తం, డాక్టర్ పాము మనోహర్, కళ్యాడపు భూమేష్, భీమనాథిని శివప్రసాద్, భైరి నిష్కం, పాము ఈశ్వర్, మేర్గు భాస్కర్, బాలే శ్రీనివాస్, ఆసం రాజేందర్ హాజరైయ్యారు.
బోరివలిలో..
సాక్షి, ముంబై: తెలంగాణ యువజన కార్మిక సంఘం (టీవైకే ఎస్) ఆధ్వర్యంలో బోరివలి దౌలత్నగర్లోని ఆధార్ హాలులో ఉగాది నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన బోరివలి-దహిసర్ ఎమ్మెల్యే వినోద్ గోసాల్కర్, స్థానిక కార్పొరేటర్ అభిషేక్ గోసాల్కర్ పలు క్రీడాపోటీల్లో విజేతలైన మహిళలు, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తెలంగాణ ప్రజలకు శివసేన ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. భారీ సంఖ్యలో హాజరైన మహిళలు పసుపు-కుంకుమ జరుకుకున్నారు. కార్యక్రమంలో టీవైకేఎస్ అధ్యక్షుడు ఉప్పు భూమన్న, ఉపాధ్యక్షుడు పురంశెట్టి గోపాల్, ప్రధాన కార్యదర్శి గాజుల మహేశ్, ఎంటీజేఏసీ నాయకులు పాల్గొన్నారు. నవోదయ కళా మంచ్, బహుజన దరువు కళా బృందం సంయుక్తంగా సాంస్కృతిక పాటలతో హోరెత్తించారు.
నాయ్‌గావ్‌లో..
దాదర్ నాయ్‌గావ్‌లోని పద్మశాలి యువక సంఘం ఆధ్వర్యంలో స్థానికులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. కార్యక్రమానికి దాదాపు 120 మందికిపైగా సభ్యులు హాజరయ్యార ని ట్రస్టీ సభ్యులు అనబత్తుల ప్రమోద్, ట్రస్టీ చైర్మన్ పాపని సుదర్శన్, అధ్యక్షుడు కోడి చంద్రమౌళి, ఉపాధ్యక్షుడు పొన్న శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కస్తూరి సుధాకర్ తెలిపారు.