ఒకే ఒక్కరు..గెలిచిందిలా!
యువజనం వెంట రాగా.. కలిసివచ్చిన సానుభూతి
నాచారంలో జెండా ఎగరేసిన కాంగ్రెస్ అభ్యర్థిని
సిటీబ్యూరో: గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతి.. డివిజన్లో ఏర్పాటు చేసిన జిమ్లతో యువజనానికి చేరువకావడంతో పాటు టీఆర్ఎస్, టీడీపీ వైఫల్యాలను అడుగడుగునా సొమ్ము చేసుకునే వ్యూహంతో నాచారం డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శాంతిశేఖర్ (సాయిజెన్ శేఖర్) విజయాన్ని సొం తం చేసుకున్నారు.ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జి బండారి లక్ష్మారెడ్డి సైతం డివిజన్లోనే మకాం వేసి ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహం అమలు చేయటం తో శాంతి అతి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ముఖ్యం గా టీఆర్ఎస్, టీడీపీ అభ్యర్థులు ఒకే సామాజిక వర్గం వారు కావడంతో రెండు పార్టీలకు ఓట్లు చీలిపోవటం కూడా కాంగ్రెస్ అభ్యర్థికి కలిసివచ్చింది. పటాన్చెరువు నియోజకవర్గంలో కాం గ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకరు గెలిచినప్పటికీ... జంట నగరాల్లో గెలిచిన ఒకే ఒక్క అభ్యర్థిగా శాంతిశేఖర్ రికార్డు సృష్టించారు.
సాయిజెన్ శేఖర్ కంట తడి
కాప్రా: నాచారం డివిజన్ నుంచి గెలుపొందిన కాం గ్రెస్ అభ్యర్థి శాంతి సాయిజెన్ భర్త సాయిజెన్ శేఖర్ ఆనందాన్ని తట్టుకోలేక కన్నీటిపర్యంతమయ్యా రు. రిటర్నింగ్ అధికారులు తుది ఫలితాలను వెల్లడిం చిన వెంటనే ఆయన ఉక్కిరిబిక్కిరయ్యారు.
హాలులో ఉన్న ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి మేడల జ్యోతితో పాటు కాప్రా సర్కిల్ ఉప కమిషనర్ సత్యనారాయణ, మల్కాజిగిరి ఏసీపీ రవిచందన్రెడ్డిలకు కంటతడి పెడుతూనే పాదాభివందనం చేశారు. సహచరులను, ఆత్మీయులను ఆనందబాష్పాలతో ఆలిం గనం చేసుకున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకోగా... కాంగ్రెస్ అభ్యర్థి శాంతి సాయిజెన్ మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి మేడల జ్యోతిపై 152 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.