రాజ్యాంగ చైతన్యాన్ని నింపే ‘శరణం గచ్ఛామి’
విజయవాడ రైల్వే డీఎస్పీ సత్తిబాబు
అమలాపురం టౌ¯ŒS :
రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రిజర్వేషన్ల కోసం కల్పించిన హక్కులు, నిర్దేశించిన సూత్రాలను ప్రజాస్వామ్య దేశంలో ఎందుకు విధిగా అమలు చేయాలో తెలుపుతూ తెరకెక్కించిన ‘శరణం గచ్ఛామి’ చిత్రం ప్రజల్లో రాజ్యాంగ చైతన్యాన్ని నింపుతుందని విజయవాడ రైల్వే డీఎస్పీ మోకా సత్తిబాబు అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు దేశానికి ఎంత అవసరమో చాటుతూ నిర్మించిన ‘శరణం గచ్ఛామి’ చిత్ర ప్రదర్శనను స్థానిక శేఖర్ స్క్రీ¯ŒS–2 థియేటర్లో ఆయన సోమవారం ఉదయం ప్రారంభించారు. అంతకు ముందు థియేటర్‌కు సమీపంలోని బుద్ధవిహార్ ప్రాంగణంలో అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి అంబేడ్కర్‌వాదులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి చిత్ర సందేశాన్ని అందరికీ తెలియజేయాలన్నారు. రిజర్వేషన్ల వ్యవస్థపై అడ్డగోలుగా మాట్లాడుతున్న వారికి ఈ చిత్రం ఓ సమగ్రమైన, శాస్త్రీయమైన ఆధారపూరిత వివరణ ఇచ్చిందన్నారు. అమలాపురంలో చిత్ర ప్రదర్శనకు సహకరించిన మున్సిపల్ మాజీ చైర్మన్, కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లా విçష్ణుమూర్తి, రాష్ట్ర కాపు జేఏసీ కో కన్వీనర్ నల్లా పవ¯ŒSకుమార్‌లను అభినందించారు. విషు్టమూర్తి, పవ¯ŒSకుమార్‌లు కూడా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై భీమ్ చెప్పారు. చిత్రాన్ని వీక్షించేందుకువచి్చన వందలాది మంది అంబేడ్కర్‌వాదులను డీఎస్పీ సత్తిబాబు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం డీఎస్పీ సహా కోనసీమ దళిత నేతలు చిత్రాన్ని వీక్షించారు. థియేటర్ వద్ద అంబేడ్కర్ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పూలమాలలు వేశారు. ‘జోహార్ అంబేడ్కర్’ నినాదాలతో థియేటర్ మారుమోగింది. అంబేడ్కర్ వాదులు పెనుమాల చిట్టిబాబు, పెయ్యల పరశురాముడు, మట్టా వెంకట్రావు, పోతుల సుభాష్ చంద్రబోస్, జిల్లా ఎక్సైజ్ సిబ్బంది అసోసియేష¯ŒS అధ్యక్షుడు రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.