రేడియల్ చాంప్ షరీఫ్ ఖాన్
జాతీయ లేజర్ సెయిలింగ్
సాక్షి, హైదరాబాద్: ఆర్మీ యాటింగ్ నోడ్‌కు చెందిన షరీఫ్ ఖాన్ జాతీయ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటాడు. హుస్సేన్ సాగర్ జలాల్లో జరుగుతున్న ఈ పోటీల్లో షరీఫ్ లేజర్ రేడియల్ విభాగంలో విజేతగా నిలిచాడు. మొత్తం 9 రేస్‌లలో షరీఫ్ 3 రేస్‌లలో నంబర్‌వన్ స్థానం అందుకున్నాడు.
2 రేస్‌లలో రెండో స్థానం, మరో 2 రేస్‌లలో మూడో స్థానం సాధించిన అతను ఓవరాల్‌గా పాయింట్ల పట్టికలో మొదటి స్థానం కైవసం చేసుకున్నాడు. సికింద్రాబాద్‌లోని ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్‌కు చెందిన దిలీప్ కుమార్‌కు రెండో స్థానం దక్కింది. కుల్దీప్ కుమార్ పాండే (ఏవైఎన్)కు మూడో స్థానం లభించింది. మరో వైపు ఊహించినట్లుగానే లేజర్ 4.7 విభాగంలో ఆర్ఎంవైసీకి చెందిన వీర్ అమర్ మీనన్ టైటిల్‌ను సాధించాడు. శుక్రవారం జరిగిన మూడు రేసులనూ గెలుచుకున్న అతను, సంపూర్ణ ఆధిక్యం కనబర్చాడు. ఈ ఈవెంట్లో జరిగిన 9 రేస్లనూ వీర్ నెగ్గడం విశేషం. మరో వైపు లేజర్ స్టాండర్డ్ విభాగంలో ఓవరాల్ విజేత కోసం గజేంద్రసింగ్, ధర్మేంద్ర సింగ్ మధ్య తీవ్ర పోటీ ఉంది. చాంపియన్‌షిప్ చివరి రోజు శనివారం స్టాండర్డ్ విభాగంలో జరిగే చివరి రెండు రేస్‌ల అనంతరం విజేత ఎవరో తేలనుంది.
శుక్రవారం రేస్‌ల ఫలితాలు:
లేజర్ స్టాండర్డ్ విభాగం: ఏడో రేస్ - 1. గజేంద్ర సింగ్ (ఏవైఎన్), 2. బి. మహాపాత్ర (ఏవైఎన్), 3. గుర్జీత్ సింగ్ (ఏవైఎన్).
ఎనిమిదో రేస్ - 1. ధర్మేంద్ర సింగ్ (ఏవైఎన్), 2. గీతేశ్ (ఏవైఎన్), 3. రమేశ్ కుమార్ (ఏవైఎన్).
తొమ్మిదో రేస్ - 1. ధర్మేంద్ర సింగ్ (ఏవైఎన్), 2. గజేంద్ర సింగ్ (ఏవైఎన్), 3. బీకే రౌత్ (ఈఎంఈఎస్‌ఏ).
లేజర్ 4.7 విభాగం: ఏడో రేస్- 1. వీర్ అమర్ మీనన్ (ఆర్‌ఎంవైసీ), 2. విష్ణు సుజీశ్ (టీఎన్‌ఎస్‌ఏ), 3. ఆర్యమాన్ దత్తా (ఆర్బీవైసీ).
ఎనిమిదో రేస్ - 1. వీర్ అమర్ మీనన్ (ఆర్‌ఎంవైసీ), 2. విష్ణు సుజీశ్ (టీఎన్‌ఎస్‌ఏ), 3. శేఖర్ గార్గ్ (ఎన్ఎస్ఎస్).
తొమ్మిదో రేస్ - 1. వీర్ అమర్ మీనన్ (ఆర్‌ఎంవైసీ), 2. ధీర్ సింఘీ (ఆర్‌ఎంవైసీ), 3. ఆర్యమాన్ దత్తా (ఆర్బీవైసీ).