ఆక్టోబర్ 29న ముంబయిలో ఐటీఏ పురస్కారాల ప్రదానం
ఈ ఏడాది13వ ఇండియన్ టెలివిజన్ అకాడమీ (ఐటీఏ) పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని వచ్చే నెల 29న ముంబయిలో ఫిల్మ్ సిటీలో నిర్వహిస్తామని ఆ ఐటీఏ కన్వీనర్ శశిరాజన్ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. సినిమా, సంగీతం, టాక్ షో,వార్తలు, కరెంట్ ఎఫైర్స్, దర్శకులు, వ్యాఖ్యాతలు, టెక్నిషియన్లు తదితరులను జ్యూరీ కమిటీ పురస్కారాలకు ఎంపిక చేసిందని చెప్పారు. అందులోభాగంగా18 టెక్నికల్ అవార్డులు, ఆరు పాపులర్ అవార్డులను పబ్లిక్ ఓటింగ్ ద్వారా ఎంపిక చేసినట్లు వివరించారు.
ఐటీఏ అవార్డుల కోసం 45 కేటగిరిలకు 1850 నామినేషన్లు వచ్చాయని చెప్పారు. ఐటీఏ కమిటీ జ్యూరీకి సిమి గరేవాల్ అధ్యక్షత వహించగా, రాకేశ్ బేడి, మిర్ మునీర్, జావేద్ సయ్యద్, ఉమేష్ గుప్తా,మాయా రావు, భరతి ప్రదాన్, అనిల్ సెహగ్ల్ సభ్యులుగా వ్యవహారించారు. నవంబర్ 3వ తేదీన ఐటీఏ అవార్డుల కార్యక్రమం స్టార్ ప్లస్‌లో ప్రసారం అవుతోందని శశిరాజన్ చెప్పారు.