ఓ పనైపోయింది
విజయవాడ (ఇంద్రకీలాద్రి):
పుష్కరాల భక్తులకు సహకరించడం బాధ్యత. విధులతో పాటు భక్తిబావం చాటు కోవడం మరో వైపు. పుష్కరాల రాష్ట్ర నలుమూలల నుంచి అనేక ప్రభుత్వ శాఖల నుంచి ఉద్యోగులు వేలాది మంది విజయవాడకు తరలివచ్చారు. తొలి రోజున విధులను ముగించుకుని తిరిగి తమ వసతి గృహాలకు వెళ్లుతూ పుష్కర స్నానం పూర్తి చేసుకున్నారు. పోలీసులు కొందరు శుక్రవారం మధ్యాహ్నం డ్యూటీ ముగియగానే దుర్గాఘాట్‌లో స్నానం ఆచరించారు.