స్వర్ణ కిరీటంతో బాబా దర్శనం
ధర్మవరం అర్బన్ : ఆపదల్లో ఉన్న భక్తుల సమస్యలను తీర్చి వారి వెన్నంటి ఉండే శ్రీ షిరిడిసాయినాథుడు భక్తులకు బంగారు కిరీటదారుడై దర్శనమిచ్చాడు. ధర్మవరం సాయినగర్‌లో ఉన్న శ్రీ షిరిడిసాయిబాబా ఆలయంలో సోమవారం ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. మధ్యాహ్నం వేలాది మందికి అన్నదానం చేశారు. అర్చక బృందం ఆధ్వర్యంలో వేదపండితులు షిరిడిసాయిబాబాకు లక్ష కుసుమార్చన నిర్వహించారు. జనసందోహంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.
నేడు గ్రామోత్సవం
మంగళవారం ఉదయం 7 గంటలకు బాబాకు అభిషేకంతో పాటు మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రం 4.30 గంటలకు బాబా ఉత్సవ విగ్రహంతో పట్టణ పురవీధులలో గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నట్లు సేవా సమితి సభ్యులు తెలిపారు.